నంది 2 కొమ్ముల మధ్య నుంచి శివుణ్ని ఎందుకు చూడాలి?

తరుచుగా దేవాలయాలను సందర్శించాలని, భగవంతుణ్ని ప్రార్థించాలని మన పెద్దలు చెబుతుంటారు. వారు ఏం చెప్పినా దానివెనక ఒక అర్థం, పరమార్థం దాగివుంటాయి. అలాగే ఆలయాలకు వెళ్లినప్పుడు మన పెద్దలు ఏం చెప్పారో అవే పాటిస్తుంటాం. కొన్నింటిపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా పెద్దవారు చెప్పారని చేస్తుంటారు. దేవాలయంలో కొంచెంసేపు కూర్చోవడం, ప్రదక్షిణాలు చేయడం, పూజలు, అభిషేకాల్లాంటివన్నీ చేస్తుంటాం. శివాలయానికి వెళ్లినప్పుడు శివలింగాన్ని బయట ఉండే నంది రెండు కొమ్ముల మధ్య నుంచి చూస్తుంటాం. అలా చూస్తూ ఆ పరమేశ్వరుడికి మన కోరికలను చెప్పుకుంటాం.

darshan between the horns of nandi in the shiva temples

త్రిమూర్తుల్లో ఒకడైన పరమేశ్వరుణ్ని అలా నంది కొమ్ములమధ్య నుంచే ఎందుకు చూడాలనే సందేహం చాలామందికి వస్తుంది. శివాలయాల్లో విగ్రహం ఉండదు. లింగ స్వరూపం ఉంది. శివలింగాన్ని దర్శనం చేసుకుంటాం. శివుడు లయకారుడు. ఆయన మూడోకన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. అంత శక్తిమంతుడు కాబట్టి ఆయన్ను నేరుగా అలా దర్శించుకోకూడదు. ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్మల మధ్య నుంచే శివుణ్ని దర్శనం చేసుకోవాలి. శివలింగానికి నమస్కారం చేసుకొని మన కోరికలు చెప్పుకోవాలి. నంది రెండు కొమ్ముల మధ్య నుంచి దర్శనం చేసుకుంటే మంచి కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+