కార్తిక మాసంలో శ్రీకాళహస్తి ఆలయం దర్శన వేళల్లో మార్పులు, ఇక కొత్తగా..!!

ఈ నెల నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం కానుంది. దీంతో, తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు ప్రత్యేక పూజలు.. అభిషేకాల తో పాటుగా పలు కార్యక్రమాల నిర్వహణకు సిద్దం అవుతున్నాయి. శక్తివంతమైన ఆలయంగా పేరున్న కాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం వేళ దర్శన వేళల్లో మార్పులు చేసారు. దక్షిణ కైలాసం గా పేర్కొనే ఈ ఆలయంలో కొత్త దర్శన వేళలను అధికారులు ప్రకటించారు.

కార్తిక మాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కొత్త వేళలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 4.15 గంటలకు గోమాత పూజ, తిరుమంనం, 4.30 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు సర్వదర్శనం, ప్రథమకాల అభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 6 గంటలకు రెండో కాల అభిషేకం, 10 గంటలకు మూడో కాల అభిషేకం, సాయంత్రం 3.30 గంటలకు ప్రదోష కాలంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ జరుగతాయని పేర్కొన్నారు.

darshan-timings-in-srikalasti-temple-in-kartihka-masam-is-changed-details-here

శ్రీకాళహస్తిలో ప్రతీ రోజు ఉదయం 5.30: సుప్రభాత సేవ, 5.45: గోమాత పూజ, 6.30: ప్రథమ కాలాభిషేకం నిర్వహిస్తారు. అదే విధంగా ద్వితీయ కాలాభిషేకం, నిత్యోత్సవం, చండీ, రుద్ర హోమాలు, నిత్య కల్యాణం, ప్రదోషకాలాభిషేకం, నీరాజనమంత్రపుష్పం, ఏకాంతసేవ సర్వ దర్శనం ఉంటుంది. ఇక.. ప్రతీ రోజూ రాహు, కేతు పూజలు నిర్వహిస్తారు.

ప్రతీ రోజు ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. సోమవారం- శ్రీమృత్యుంజయశివలింగానికి, మంగళవారం- కాలభైరవునికి, గురువారం- శ్రీమేధా దక్షిణామూర్తికి (గురువారం), శనివారం- శనిభగవానునికి, ఆదివారం- సూర్యనారాయణమూర్తికి అభిషేకం ఉంటుంది. ఇక.. పౌర్ణమికి ఊంజల్‌సేవ, అమావాస్యకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కొనసాగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+