వివేకా కేసులో కీలక పరిణామం - ఉత్కంఠ..!!
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయ సహాయం చేయాలని కోరారు. ఇదే సమయంలో ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు సీబీఐకి ఇచ్చిన గడువు ముగిసింది. అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు. సునీత...దస్తగిరి పిటీషన్లను విచారించనున్న సుప్రీం కేసు విచారణ గుడవు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
వివేకా హత్య కేసులో విచారణ కోసం సీబీఐ నిర్దేశించిన గడువు ముగిసింది. జూన్ నెలాఖరులోగా విచారణ పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ, కేసు విచారణ పూర్తి కాలేదు. ఈ సమయంలోనే అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దస్తగిరి సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని ఇప్పటికే కృష్ణారెడ్డి పిటీషన్ దాఖలు చేసారు. తనకు న్యాయ సహాయం కావాలని కోరుతూ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్ధిక స్థోమత తనకు లేనందున న్యాయవాదిని కల్పించాలని దస్తగిరి సుప్రీంకోర్టును కోరాడు. దీనిపై రేపు న్యాయస్థానం విచారించనుంది. ఇదే సమయంలో అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసిన పిటీషన్ పైనా విచారణ జరగనుంది.

ఇటు సుప్రీంకోర్టు ఈ కేసులో అవినాశ్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా చేరుస్తూ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు సంస్థ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. నిందితుల పాత్రను నిరూపించేలా కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, గూగుల్ టేకౌట్, వివేకా ఇంటిలోని వైఫైకి సంబంధించిన సమాచారం, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు, నిపుణుల అభిప్రాయాలు సహా భారీ డేటాను సమీకరించినట్లు వెల్లడించింది.
జూన్ 30లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి విధించిన గడువు ముగిసిపోయింది. ఆ నేపథ్యంలోనే ముగ్గురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు ఢిల్లీ ఎఫ్‌ఎస్‌ఎల్ చేపడుతున్న నిన్‌హైడ్రిన్ టెస్ట్ వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో విచారణ గడువు పెంపు పైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications