తాగే వస్తాడు, విద్యార్థులతో మందు పార్టీ: రిషికేశ్వరి ఇష్యూపై డేవిడ్ రాజు సంచలనం
గుంటూరు: రిషికేశ్వరి ఆత్మహత్య ఉదంతం నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల ప్రొఫెసర్ డేవిడ్ రాజు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రిన్సిపాల్ బాబూరావుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వవిద్యాలయంలో ఓ కులం వారి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోందని ఆయన అన్నారు.
నిజాలు మాట్లాడేవారి నోరు నొక్కేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రిన్సిపాల్ బాబూరావు తాగి క్లాసుకు వెళ్తారని, ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటల పాటు స్టాఫ్ రూంలో నిద్రపోతారని ఆయన అన్నారు. అమ్మాయిలతో బాబూరావు అసభ్యంగా ప్రవర్తించే మాట కూడా నిజమేనని ఆయన అన్నారు.

విద్యార్థులు ప్రతివారం ప్రిన్సిపాల్‌కు మందు పార్టీ ఇవ్వాలని, లేదంటే విద్యార్థులకు మార్కులు వేయరని, ఇలాంటి చరిత్ర ఉందనే ఉద్దేశంతోనే గతంలో బాబూరావు పనిచేసిన కాలేజీల యాజమాన్యాలు తరిమేశాయని ఆయన మంగళవారంనాడు అన్నారు.
ఫ్రెషర్స్ పార్టీలో బాబూరావు మద్యం సేవించి డ్యాన్స్ చేశారని, బాబూరావు బాధలు తట్టుకోలేక ఇద్దరు మహిళా ఫ్యాకల్టీలు వెళ్లిపోయారని ఆయన అన్నారు రిషికేశ్వరి మరణించిన రోజున ఇంకా బతికే ఉందని లేఖ ఇవ్వాలని విశ్వవిద్యాలయం వైద్యాధికారిపై ఒత్తిడి తెచ్చారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications