తిరుపతిలో పసికందుల మృతదేహాల కలకలం.. మురికి కాలువలో !

కుటుంబం గొడవలు కావొచ్చు, వివాహేతర సంబంధం కావొచ్చు.. ఆర్ధికపరమైన ఇబ్బందులు కావొచ్చు, మరే ఇతర కారణాలైనా కావొచ్చు కానీ.. ఓ దుర్మార్గపు పనికి మాత్రం ఒడిగట్టారు. ఇద్దరు పసికందులను మురికి కాలువలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరు అశోక్‌నగర్‌ సమీపంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న కాలువలో చెత్త తొలగిస్తుండగా పారిశుద్ధ్య కార్మికులు రెండు పసికందుల మృతదేహాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పసికందుల మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన ఆ శిశువులు కవలలుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శిశువుల వయస్సు కనీసం రెండు నుంచి మూడు రోజుల మధ్య ఉంటుందని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

dead-bodies-of-infants-found-in-drainage-at-tirupati

కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే శిశువుల మృతదేహాలు కాలువలోకి కొట్టుకు వచ్చాయా ? లేక ఎవరైనా తెచ్చి పడేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నామని.. ఇటీవల ఆస్పత్రులు, ప్రసూతి కేంద్రాల్లో పుట్టిన శిశువుల వివరాలను సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అనూహ్య ఘటన సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మానవత్వాన్ని మంటగలిపేలా ఈ తరహా ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+