మూటలో 50ఏళ్ల మహిళ శవం..:తుని రైల్వే స్టేషన్ లో కలకలం
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ లో గుర్తు తెలియని మృతదేహాన్ని దుండగులు రైల్వే కౌంటర్ వద్ద పడేసి పారిపోయారు. శవాన్ని మూటలో కట్టి కౌంటర్ వద్ద పడేసి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం పోలీసులు మూటను గుర్తించారు.
మూట నుంచి రక్తం కారుతుండటంతో మృతదేహమే అయి ఉంటుందని భావించారు. ఆ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారి సమక్షంలోనే మూటను తెరిచారు. మూటలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె వయసు సుమారు 50ఏళ్లు ఉండవచ్చునని భావిస్తున్నారు.

హత్యానంతరం మృతదేహాన్ని రైల్లోనే తరలించాలని భావించిన దుండగులు.. ఆపై దాన్ని కౌంటర్ వద్దే వదిలి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications