Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌, రఘురామ పొలిటికల్ వార్‌- ఎవరికెంత లాభం, నష్టం ? గేమ్‌కు శుభంకార్డు అప్పుడే ?

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం యుద్దం చేస్తున్న రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పార్టీ అధినేత, సీఎం జగన్‌ వార్‌ నానాటికీ ముదురుతోంది. నిత్యం ఏదో ఒక సమస్యపై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా సీఎం జగన్‌కు రఘురామ లేఖలు సంధిస్తుండగా.. దానికి కౌంటర్‌గా ప్రభుత్వం తెరచాటు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రఘురామపై వేటు కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైసీపీ పలుమార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోవడంతో తాజాగా సుప్రీంకోర్టు, హైకోర్టుకు తమ న్యాయవాదిలో లేఖలు రాయించినట్లు తెలుస్తోంది.

Recommended Video

    CM Jagan VS Raghurama Krishnam Raju | Oneindia Telugu
     జగన్‌, రఘురామ పొలిటికల్‌ వార్‌

    జగన్‌, రఘురామ పొలిటికల్‌ వార్‌

    ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఆ పార్టీ తరఫున గెలిచిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కాస్తా రెబెల్‌ ఎంపీ రఘురామగా మారిపోయారు. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద అంశాలన్నీ కెలకడం మొదలుపెట్టారు.

    టీటీడీ భూములు, ఏపీలో ఇంగ్లీష్‌ మీడియం అమలుతో మొదలుపెట్టిన ఆయన వార్‌ ఇవాళ తాజాగా సీఎం జగన్‌కు లేఖ రాసిన టీటీడీ స్పెసిఫైడ్ బోర్డు వ్యవహారం వరకూ నిరంతరాయంగా కొనసాగుతోంది. తొలుత రఘురామను అంతగా పట్టించుకోని వైసీపీ.. ఆ తర్వాత వ్యక్తిగతంగా మాటల దాడి వరకూ వెళ్లడంతో లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రఘురామ వర్సెస్‌ జగన్‌గా పరిస్ధితి మారిపోయింది.

    చంద్రబాబు స్ధానంలో ప్రతిపక్ష నేతగా రఘురామ

    చంద్రబాబు స్ధానంలో ప్రతిపక్ష నేతగా రఘురామ

    ఏపీలో రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయంతో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇదే పెద్ద విషాదం అంటే ఆ తర్వాత విపక్ష నేత చంద్రబాబును మించిపోయి రఘురామరాజు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడం మొదలుపెట్టేశారు. దీంతో ఇప్పుడు ఏపీలో విపక్ష నేత చంద్రబాబా ? రఘురామరాజా ? అన్న చర్చ సాగుతోంది. నిత్యం ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడంతో పాటు ఏకంగా సీఎం జగన్‌పైనే ఆయన సాగిస్తున్న వార్‌ రఘురామరాజును అసలైన విపక్ష నేతగా మార్చేసిందంటే అతిశయోక్తి కాదు.

     జగన్‌, రఘురామ వార్‌తో ఎవరికి మేలు ?

    జగన్‌, రఘురామ వార్‌తో ఎవరికి మేలు ?

    సీఎం జగన్‌ వర్సెస్‌ రఘురామరాజుగా సాగిపోతున్న పొలిటికల్‌ వార్‌తో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం అన్న చర్చ ఏపీలో సాగుతోంది. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రఘురామరాజు రోజూ రాస్తున్న లేఖలు, లేవనెత్తుతున్న అంశాలను బట్టి చూస్తుంటే విపక్షాలను రఘురామ మించిపోయారన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో ఆయన లేవనెత్తుతున్న అంశాలకు ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్పందించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో చంద్రబాబు వల్ల కానిది రఘురామ చేస్తున్నట్లు ప్రజల్లో ఆయనకు మైలేజ్ పెరుగుతోంది. చంద్రబాబు చేసే విమర్శల్ని పట్టించుకోని వైసీపీ సర్కార్‌.. ఇప్పుడు రఘురామ ప్రశ్నలకు మాత్రం సమాధానాలు వెతికే పనిలో ఉంది. దీంతో ఆయనపై మరోమారు అనర్హత వేటు కోసం లోక్‌సభ స్పీకర్‌కు ఘాటుగా లేఖ రాసింది.

    రఘురామపై రూటుమార్చిన వైసీపీ

    రఘురామపై రూటుమార్చిన వైసీపీ

    నిన్న మొన్నటివరకూ రఘురామరాజుపై అనర్హత వేటు పడుతుందని భావించినా అది కాస్తా ఆలస్యం కావడంతో వైసీపీలో అసహనం పెరుగుతున్నట్లు తాజాగా ఎంపీ సాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖ చూస్తే అర్దమవుతుంది. అయితే అనర్హత వేటు పడుతుందో లేదో తెలియని పరిస్ధితుల్లో రఘురామను మరో విషయంలో ఇరికించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. బెయిల్‌ షరతుల్ని పాటించకుండానే ఆస్పత్రి డిశ్చార్జ్‌ అయి వెళ్లిపోయిన రఘురామరాజు పరారీలో ఉన్నట్లు సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రధాని, రాష్ట్రపతికి వైసీపీ న్యాయవాది కోటంరాజు రాసిన లేఖలు గమనిస్తే ఇందులో ఏ ఒక్కరు స్పందించినా రెబెల్‌ ఎంపీ ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    గేమ్‌కు శుభం కార్డు అప్పుడే

    గేమ్‌కు శుభం కార్డు అప్పుడే

    రఘురామరాజు వర్సెస్‌ సీఎం జగన్‌గా మారిన సాగిపోతున్న పొలిటికల్ వార్‌ నానాటికీ ముదురుతుండటంతో దీనికి శుభంకార్డు ఎప్పుడు పడుతుందన్న చర్చ కూడా పెరుగుతోంది. అయితే రఘురామరాజుపై వైసీపీ కోరుతున్నవిధంగా లోక్‌సభ స్పీకర్‌ అనర్హత వేటు వేస్తే ఈ ఆటకు ఓ టర్నింగ్‌ పాయింట్‌ లభిస్తుంది. అయితే అదంత సులువుగా కనిపించడం లేదు. అలాగని వైసీపీ నేతలు, సీఎం జగన్‌ మౌనం వహిస్తున్నా రఘురామరాజు మాత్రం నిత్యం లేఖాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య భవిష్యత్తులోనూ సయోధ్య కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. ఇప్పట్లో అనూహ్య పరిణామాలేవీ జరగకపోతే 2024 ఎన్నికల నాటికి ఈ వార్‌కు శుభంకార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+