వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: ఆరునెలల క్రితం చనిపోయిన డిఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

చనిపోయిన డిఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు, క్ల‌రిక‌ల్ మిస్టేక్ అంట ?

అమరావతి: ఎపి పోలీస్ శాఖలో విచిత్రం చోటుచేసుకుంది. చనిపోయినవ్యక్తిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్టమెంట్ వార్తల్లోకెక్కింది. పైగా అలా ఆర్డర్ లు జారీ చేసింది ఏ చిరుద్యోగి గురించో కాదు ఏకంగా డిఎస్పీ స్థాయి అధికారి గురించి కావడం గమనార్హం. చనిపోయిన ఆరునెలల తరువాత బదిలీ చెయ్యడమే కాదు తక్షణమే వచ్చి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యమని కూడా ఆదేశించారప్రభుత్వ శాఖల్లో పేరుకుపోతున్న నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసే ఘటన ఇది. ఏదేమైనా ఈ వ్యవహారం ద్వారా పోలీస్ శాఖ అభాసుపాలైందని చెప్పక తప్పదు. పోస్టింగ్ కోసం బూట్లరిగేలా తిరుగుతున్న తమని పట్టించుకోని ఉన్నతాధికారులు చనిపోయినవారికి మాత్రం అడక్కుండానే ఆర్డర్ ఇస్తున్నారని పోలీసు సిబ్బందే విమర్శలు చేస్తున్నారు.

 డిఎస్పీల బదిలీలు...

డిఎస్పీల బదిలీలు...

ఎ.పి.లో మొత్తం 16 మంది డిఎస్పీల‌ను బ‌దిలీ చేస్తూ డి.జి.పి. సోమ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు. రెండు నెలల క్రితం డిఎస్పీలను భారీ సంఖ్యలో ఒకేసారి 36 మందిని బదిలీ చేసిన ఎపి మళ్లీ రెండు నెలల వ్యవధిలో మరో 16 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జాబితాలో ఒక డిఎస్పీ పేరే సంచలనం సృష్టిస్తోంది.

 ఏమైందంటే

ఏమైందంటే

తాజాగా పోలీస్ శాఖ బదిలీ చేసిన 16 మంది డిఎస్పీల జాబితాలో తిరుమ‌ల ఎస్‌బి డిఎస్పీ రామాంజనేయులు పేరు కూడా ఉంది. ఈ జాబితాలో 12 పేరు ఆయనది. రామాంజనేయులును తిరుమల నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ట్రాన్స్ ఫర్ చేస్తూ వెంటనే వచ్చి హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అయితే ఎస్ బి డిఎస్పి రామాంజనేయులు 6 నెలల క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు.

 క్లరికల్ మిస్టేక్...

క్లరికల్ మిస్టేక్...

అయితే ఈ ఉత్తర్వులు రావడంతోనే తోటి సిబ్బందిలో ఈ విషయం చర్చనీయాంశం కావడంతో కలకలం రేగింది. చనిపోయిన ఆరునెలలకు రామాంజనేయులను బదిలీ చేయడంతో పోలీస్ శాఖలో విచిత్రంగా చెప్పుకున్నారు. ఆ తరువాత ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో విష‌యం ఆల‌స్యంగా తెలుసుకొన్న పోలీసు ఉన్న‌తాధికారులు విచారణ చే జ‌రిగింది క్ల‌రిక‌ల్ మిస్టేక్ గా తేల్చారు. వెంటనే రామాంజ‌నేయులు పేరును తొల‌గిస్తూ మరోసారి ఆదేశాలు జారీ చేశారు.
ఏదేమైనా ఇంతటి ప్రాధాన్యత కలిగిన విషయాల్లో ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని చెప్పకతప్పదు.

English summary
amaravathi:The police department of andhra pradesh has issued a transfer order of deceased deputy superintendent of police. Mr. Ramanjaneyulu was reported dead 6 months back before the letter was issued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X