కిరణ్ కొత్తపార్టీపై గల్లా, ఎన్నికల తర్వాత అని రాయపాటి

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత: రాయపాటి
కొంతకాలంగా కొత్త పార్టీ విషయమై మాట్లాడుతున్న గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మరోసారి స్పందించారు. కొత్త పార్టీ విషయమై ఇప్పుడు నిర్ణయం తీసుకోమని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నందున ఆ తర్వాత తీసుకుంటామని చెప్పారు.
కిరణ్ వెంటే: పితాని
రాష్ట్ర సమైక్యతకు కట్టుబడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్ఠానం మార్చాలని చూస్తే సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వెంటే నిలుస్తామని మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకరిద్దరు మంత్రులు అధిష్ఠానం నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించవచ్చని, కానీ, సీమాంధ్ర ప్రజా ప్రతినిధులంతా సమైక్యతకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.
తనకు ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం మేరకు కిరణ్‌కు కొత్త పార్టే పెట్టే ఆలోచన ఎంతమాత్రం లేదన్నారు. కిరణ్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్ అవాకులూ చవాకులూ పేలుతున్నారన్నారు. జగన్ ప్రేలాపనలు ఇప్పటి వరకూ సమైక్యం కోసం పోరాడిన వారందరినీ అవమానించేలా ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications