హైద్రాబాద్ అవసరంలేదు!: విశాఖ కోసం కిషోర్ బ్యాటింగ్

Declare Vizag as capital of Seemandhra: Kishore
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో విశాఖను సీమాంధ్ర రాష్ట్ర రాజధానిగా ఇప్పుడే ప్రకటించాలని, కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ గురువారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడంలో అర్థం లేదన్నారు.

తెలంగాణేతర ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉన్నా ఉమ్మడి రాజధానిగా ప్రకటించనవసరం లేదన్నారు. విశాఖపట్నంను మాత్రమే రాజధానికాగల నగరమని 1953లోనే జస్టిస్ వాంచూ కమిటీ నివేదిక ఇచ్చిందంటూ తన లేఖతో దాన్ని జతపరిచారు.

పళ్లం రాజుకు సమైక్య సెగ

కేంద్రమంత్రి పళ్లం రాజు, ఎంపీలు చింతామోహన్, కనుమూరి బాపిరాజులు రచ్చబండలో పాల్గొనేందుకు రాగా సమైక్యవాదులు వారిని అడ్డుకున్నారు. విభజనను అడ్డుకోకుండా ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. చిత్తూరుజిల్లాలో ఎంపీ చింతా పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. జిల్లాలో వరుసగా మూడో రోజూ రచ్చబండకు సమైక్య సెగ తగిలింది.

బుచ్చినాయుడు కండ్రిగ సభలో తిరుపతి ఎంపీ చింతా మోహన్ ప్రసంగం మొదలుపెట్టి సోనియా పేరు చెప్పగానే జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు. సోనియా సమైక్య ద్రోహి, ఆమె పేరు ఎత్తవద్దంటూ సభను అడ్డుకున్నారు. దీంతో సభను అర్థంతరంగా ముగించి ఎంపీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో జరిగిన రచ్చబండలో ఎంపీ కనుమూరి బాపిరాజుకు సమైక్య సెగ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లం రాజును సమైక్యవాదులు అడ్డుకుని ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+