డిగ్రీ విద్యార్థిని హత్య: లైంగిక కోరిక తీర్చలేదని సోదరుడే!

జిల్లాలోని రామనాథపురానికి చెందిన పసుపుల వడ్డే కొండన్న, కొండమ్మ దంపతుల పందొమ్మిదేళ్ల రెండో కుమార్తె లక్ష్మీ దేవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం అన్నలు పొలం పనులకు వెళ్లారు. వారికి భోజనం తీసుకు వెళ్లేందుకు ఆమె బయలుదేరింది.
ఇది గమనించిన చిన్నాన్న కొడుకు శేఖర్ ఆమె వెనుకనే వెళ్లాడు. మరికొద్దిసేపట్లో పొలానికి చేరుతారనగా... వెనుక నుండి గొడ్డలితో శేఖర్ దాడి చేశాడు. అక్కడికక్కడే ఆమె ప్రాణాలను విడిచింది. డిఎస్పీ శ్రీనివాస రావు, సిఐ రమేష్ బాబు అక్కడకు చేరుకొని ఆరా తీశారు.
వారు వచ్చే సమయమానిక శేఖర్ కొత్తకోటకు వెళ్లలేదు. దీంతో అప్రమత్తమయ్యారు. లక్ష్మీదేవిని శేఖర్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధిత యువతి తల్లిదండ్రులు చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications