చికెన్‌కు గిరాకీ, ఏపీకొస్తాం: బాబుకు జపాన్ (పిక్చర్స్)
హైదరాబాద్: జపాన్‌లో చికెన్, చేపలు, వెన్న తదితర ఆహార ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని, ప్రస్తుతం చికెన్‌ను బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అయినా డిమాండ్‌ను చేరుకోవడం లేదని, ఈ కొరతను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో రూ.900 కోట్ల పెట్టుబడులతో ఆహాకరం శుద్ధి పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తిగా ఉన్నామని జపాన్‌లోని మయేవక సంస్థ ఛైర్మన్ యెషిరో తనాకా తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబును గురువారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసంలో మయేవక సంస్థ ప్రతినిధులు, జపాన్ రాయబార కార్యాలయం ప్రతినిధి టొమోయి యుకి కొహరాడ ఆయనతో సమావేశమయ్యారు. ఆహార శుద్ధిలో అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తామన్నారు. జేబీఐసీ, జెట్రో, జైకా తదితర జపాన్ ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకుంటామని యెషిరో తనాకా తెలిపారు.
ఏపీలో రూ.900 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ యోచిస్తోందన్నారు. దీనిలోభాగంగా 24 ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఆయా సంస్థలతో కలిసి ఏపీలో మెగా ఫుడ్‌పార్కు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. జపాన్‌కు అవసరమైన ఆహార దిగుమతులు గుర్తించి వాటి కోసం కృష్ణపట్నం పోర్టు సమీపంలో అవసరమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలని సంస్థ ప్రతినిధులకు చంద్రబాబు సూచించారు.

జపాన్
జపాన్ పర్యటనలో చంద్రబాబుకు ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు జిల్లాలోని శ్రీని ఫుడ్‌పార్కును కూడా యెషిరో తనాకా సందర్శించారు. ప్రభుత్వమే ఎగుమతి జపాన్ అవసరాల మేరకు శుద్ధిచేసి ఎగుమతి చేసేందుకు అవసరమైన ఆహార ఉత్పత్తుల్ని గుర్తించేందుకు ఏపీ, మయేవకా సంస్థలు అంగీకరించాయి.

జపాన్
సముద్ర ఉత్పత్తులకు విలువ జోడించేందుకు నియంత్రణ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనిలోభాగంగా తొలిదశలో చేపలు, ధాన్యం, చికెన్, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులను ప్రభుత్వమే జపాన్‌కు ఎగుమతి చేయనుంది.

జపాన్
ఆహారశుద్ధి పరిశ్రమలకు సంబంధించి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఐఐ, మయేవకా భాగస్వామ్యంతో అగ్రిబిజినెస్ గ్రూపు ఏర్పాటు చేస్తుంది.

చంద్రబాబు
రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో రూ. 27,200 కోట్లు వెచ్చించి నీరు-చెట్టు కార్యక్రమాన్ని అమలు చేసి కరువును రూపుమాపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

చంద్రబాబు
తద్వారా చరిత్రను తిరగరాస్తానని ప్రకటించారు. బాధ్యత లేని గత ప్రభుత్వాల పాలన కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటానని.. 2029 కల్లా దేశంలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చి దిద్దుతానని ప్రకటించారు.

చంద్రబాబు
గురువారం చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం గుమ్మసముద్రం చెరువులో ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు.

చంద్రబాబు
నదుల అనుసంధానం ద్వారా గోదావరి నది మిగులు నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళిస్తే, డెల్టాలో వినియోగమయ్యే కృష్ణ నీటిని రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు మళ్లించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీన పట్టిసీమ నుంచి గోదావరి నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లింపు పనులను ప్రారంభిస్తామన్నారు.

చంద్రబాబు
తనకు వ్యక్తిగత స్వార్థమేమీ లేదని, రాషా్ట్రనికి కాంగ్రె్‌సపార్టీ చేసిన ద్రోహానికి ప్రతీకారంగా రాషా్ట్రన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నానని స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలకు తమ ప్రభుత్వం మేలు చేస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు.

చంద్రబాబు
2022 నాటికి రాషా్ట్రన్ని దేశంలో మొదటి మూడు రాషా్ట్రల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని, అలాగే 2029 నాటికి నెంబర్‌వన్‌గా నిలుపుతామని ప్రతిన పూనారు.

చంద్రబాబు
కాగా అంతకుమునుపు ముఖ్యమంత్రి గుమ్మసముద్రం చెరువులో నీరు-చెట్టు కార్యక్రమానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. తర్వాత స్వయంగా జేసీబీ నడిపి చెరువులో పూడిక తీత పనులను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications