వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ బహుత్ దూర్‌హై: కిరణ్ చమత్కారం, టిపై 32మంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఢిల్లీ వెళ్లే విషయమై విలేకరులు ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'చాలా దూరం ఉంద'ని చమత్కరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. లాబీల్లో ముఖ్యమంత్రి కనిపించినప్పుడు విలేకరులు ఆయనను పలకరించారు.

తాను మరో గంటన్నర పాటు తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీలో మాట్లాడుతానని చెప్పారు. ఢిల్లీ ఎప్పుడెళ్తున్నారని ప్రశ్నించగా... 'ఢిల్లీ బహుత్ దూర్ హై' అంటూ వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానంతో చర్చించేందుకు కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈ రోజు ఢిల్లీ వెళ్లవలసి ఉంది.

 Kiran Reddy

శాసన సభ ఉన్నందున తాను ఢిల్లీకి రావడం లేదని కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పారు. బొత్స మాత్రం ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే, విభజనకు అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నందున అసంతృప్తితోనే కిరణ్ వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది.

కాగా, తెలంగాణ ముసాయాదా బిల్లు పైన ఇప్పటి వరకు 32 మంది శాసన సభ్యులు శాసన సభలో మాట్లాడారు. ఒక్కో సభ్యునికి ఐదు నిమిషాల సమయం ఇస్తున్నట్లు సభాపతి నాదెండ్ల మనోహర్ గురువారం తెలిపారు. పలు పార్టీలకు చెందిన సభ్యులు ప్రసంగించారు.

English summary
AP Chief Minister Kiran Kumar Reddy on friday said that Delhi is too far from Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X