తిరుపతి హోటల్‌లో ఢిల్లీ వ్యక్తి హత్య, భార్య జంప్, ఏమైంది?
తిరుపతి: తిరుపతిలోని ఓ హోటల్‌లో ఢిల్లీకి చెందిన యువకుడు మునీత్ హత్యకు గురయ్యాడు. గదిలోని సీసీకెమెరాలు పనిచేయడం లేదు అయితే మద్యం మత్తులోనే ఈ హత్య జరిగిందనే ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన మునీత్ అనే వ్యక్తి సోమవారం రాత్రి పూట తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య తర్వాత తన భర్త కొద్దిసేపట్లోనే వస్తారని చెప్పిన భార్య హోటల్ గదిలో నుండి వెళ్ళిపోయింది.

రైల్వేస్టేషన్‌తో పాటు రైల్వేస్టేషన్ దారిలో ఉన్న సీసీటీవి పుటేజీని పోలీసులు సేకరించారు. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడి గదిలో మద్యం సీసాలు కూడ లభ్యమయ్యాయి
ఢిల్లీకి చెందిన మునీత్ భార్యతో కలిసి ఈ నెల 4వ తేదీన తిరుపతి వచ్చాడు. 5వ తేదీన నెల్లూరు మైపాడు బీచ్‌లో వెళ్ళారు.కానీ , అనుహ్యంగా మునీత్ సోమవారం నాడు హత్యకు గురయ్యాడు.భర్త హత్యకు గురైన తర్వాత ఆయన భార్య హోటల్ గది నుండి వెళ్ళిపోయిందని పోలీసులు గుర్తించారు. తన భర్త వెనుక వస్తున్నాడని హోటల్ సిబ్బందికి చెప్పి భార్య రైల్వేస్టేషన్‌కు వెళ్లిపోయింది.
మృతుడి బావ మరిది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితో పాటు మరోవ్యక్తి కలిసి ఢిల్లీకి చెందిన మునీత్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.మృతుడి భార్య నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications