'నిందితులు ఎవరైనా, కాల్ మనీ - సెక్స్ రాకెట్ వీడియోలు బయటపెట్టాలి'
విజయవాడ: కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో వీడియో టేపులను బహిర్గతం చేయాలని సిపిఐ నేత శంకర్ సోమవారం నాడు డిమాండ్ చేశారు. ప్రజాతంత్ర ఉద్యమాలకు నిలయమైన బెజవాడలో గత ఏడాది ప్రజా ఉద్యమాల్లో ముందుండి పలు ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు తమ పార్టీ సాగించిందన్నారు.
భవానీపురం మహ్మదీయ కో ఆపరేటీవ్ సొసైటీ భూముల విషయంలోనూ, కనకదుర్గా లే అవుట్ అప్రూవల్ అక్రమాలపై, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఆట స్థలం ప్రయివేటుకు ధారాదత్తం చేయాలనే సమస్యలపై, గోశాల పరిరక్షణకు ఉద్యమించి చివరకు కాసుల కోసం శ్మశానాలను కబ్జా చేసే విషయంలో టిడిపి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి తిప్పికొట్టామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధనపై పోరాటాలు సాగించామని తెలిపారు. కల్తీ మద్యం, కాల్‌మనీ కీచకులపై నగరాన్ని అసాంఘిక శక్తుల భారీ నుంచి కాపాడుదామంటూ ముందుగా స్పందించింది తమ సిపిఐ పార్టీయేనని చెప్పారు.
కాల్ మనీ కీచకుల, సెక్స్ రాకెట్‌లోని వీడియో టేపులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులు ఏ స్థాయిలో ఉన్నా, వారిని ప్రజల ముందు ప్రవేశపెట్టి కఠినంగా శిక్షించి, ప్రభుత్వం తమ పారదర్శకతను చాటుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications