వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక సంస్థల ఎన్నికల రద్దు డిమాండ్ ... కోర్టులో తేల్చుకునేందుకు టీడీపీ రెడీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలో టీడీపీ నేతలను వలసలకు ప్రోత్సహిస్తూ మరోవైపు టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న నేపధ్యంలో ఎన్నికలు రద్దు చెయ్యాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అయితే కరోనా వైరస్ దేశంలో ప్రబలుతున్న కారణంతో ఈసీ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. అయితే టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన ఘటనల నేపధ్యంలో ఎన్నికలను మరికొంత కాలం పాటు జరగకుండా ఆపాలని భావిస్తుంది. అందుకు ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తుంది. ఈ నేపధ్యంలో కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల వాయిదాతో టీడీపీకి ఊరట

ఎన్నికల వాయిదాతో టీడీపీకి ఊరట

రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతూ అభ్యర్థులను భయ భ్రాంతులకు గురి చెయ్యటం అలాగే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించి వెయ్యటం వంటి ఘటనల నేపధ్యంలో టీడీపీ నేతలు చాలా చోట్ల నామినేషన్లు దాఖలు చెయ్యలేదు. ఇక ఇలాంటి దారుణ ఘటనల నేపధ్యంలో కొనసాగుతాయని భావించిన ఎన్నికలు అనూహ్యంగా వాయిదా పడటం టీడీపీకి ఊరటనిచ్చిన అంశం.

ఎన్నికలు రద్దు చేసి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ

ఎన్నికలు రద్దు చేసి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ

అయితే ఎన్నికలను పూర్తిగా ఇప్పుడు నిర్వహించకుండా రద్దు చేస్తే బాగుంటుందని, కేంద్ర బలగాలతో కట్టుదిట్టంగా రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ భావిస్తుంది.
ఏపీ సర్కార్ ఎన్నికల నిర్వహణ కోసం హడావుడిగా తెచ్చిన ఆర్డినెన్స్‌ పై న్యాయపోరాటం చేసే అవకాశం దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది . ఇప్పటికే నామినేషన్ల పర్వంలో బెదిరింపులు, దాడులు, కిడ్నాప్ లు, నామినేషన్లు చించివేతలు తదితర ఘటనలపై పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన టీడీపీ ఏపీ ఎన్నికల కమీషనర్ రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది.

 హైకోర్టులో ఎన్నికల రద్దుకు టీడీపీ పిటీషన్

హైకోర్టులో ఎన్నికల రద్దుకు టీడీపీ పిటీషన్

తర్వాత దశలో హైకోర్టులో పిటిషన్ వేసి ఎన్నికలను రద్దు చేయించాలని భావిస్తుంది .ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాలు, వైసీపీ తెచ్చిన ఆర్డినెన్స్ , ఇప్పుడు ఆరు వారాల పాటు వాయిదా నిర్ణయాలతో ఎన్నికల ప్రక్రియ చెల్లదన్న వాదన వినిపించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అంతేకాదు ఎన్నికల వివాదాలకు సంబంధిన వీడియో, ఆడియో, చిత్రాల ఆధారాలను సిద్ధం చేసుకుంటోంది.

Recommended Video

Coronavirus In India : Paracetamol Sufficient For COVID 19, Trolls On KCR And Jagan
ఆర్డినెన్స్ తో పాటు అన్ని అస్త్రాలను ఉపయోగించనున్న టీడీపీ

ఆర్డినెన్స్ తో పాటు అన్ని అస్త్రాలను ఉపయోగించనున్న టీడీపీ

ఇక ఇవే కాకుండా కరోనా ప్రభావం ఆరు వారాల తర్వాత కూడా ఉండవచ్చు. కాబట్టి కరోనా ప్రభావం ఎంత కాలం ఉంటుందో కూడా తెలియదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగకుండా రద్దు చేసేలా వాదనలు వినిపించాలని అన్ని అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది టీడీపీ . ఆర్డినెన్స్ ప్రకారం చూస్తే ఎన్నికల ప్రక్రియ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్న భావనలో ఉన్న టీడీపీ కోర్టు మెట్లెక్కనుంది.

English summary
TDP hopes that it will be good to cancel the elections and re-notify with the central forces and hold elections.It is reported that AP government has initiated efforts to file a law on the ordinance that has been put in motion for election. The TDP has complained to Election Commissioner Ramesh Kumar, who has gathered full evidence on the incidents of the attacks during election time. The fight for the dissolution of elections in the High Court is going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X