లగడపాటికి భలే డిమాండ్: రాజకీయాల్లోకి రావాలంటూ స్లోగన్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శైలే వేరు. ఆయన ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. రాష్ట్ర విభజన కారణంగా ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారా, లేదా అనేది సందేహమే.

ఇటువంటి సందర్భంలో మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ లగడపాటి అభిమానులు నినాదాలు చేశారు. శనివారం విజయవాడ నగరంలోని కందుకూరి కళ్యాణమండపంలో కాంగ్రెస్‌ కార్యకర్త బెజవాడ యేహాన్‌ సంతాప సభ జరిగింది. ఈ సభకు మాజీ ఆయన హాజరయ్యారు.

Demand for Lagadapati Rajagopal's political re entry

లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తాను ఇక రాజకీయాల్లో ఉండడని అప్పట్లో లడగపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అమరావతిలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన తెలుగుదేశంలో చేరతారనే ఊహగానాలు కూడా వచ్చాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fans are demanding the political reentry of Vijayawada ex MP Lagadapati Rajagopal.
Please Wait while comments are loading...