దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

శాడిస్ట్ మొగుడిని సస్పెండ్ చేసిన డీఈవో: నా విషయం చెప్పొద్దని ఆ రాత్రి భార్యకు వేడుకోలు!

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   Groom Beats Bride Mercilessly On First Night, Got Suspended

   చిత్తూరు: సంచలనం రేపిన శాడిస్ట్ భర్త రాజేష్ ఘటనపై చిత్తూరు జిల్లా విద్యా శాఖ స్పందించింది. వి.కోటలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్న రాజేష్‌ను సస్పెండ్ చేశారు. పెళ్లైన తొలి రాత్రి రాజేష్ తన భార్యను రాక్షసంగా వేధించిన విషయం తెలిసిందే.

   చదవండి: శాడిస్ట్ మొగుడు: 'ఆ విషయం లీక్ చేసిందనే శైలజపై దాడి'

   ఈ నేపథ్యంలో రాజేష్‌ను విధుల నుంచి తప్పిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. రాజేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. విచారణలో ఆయన పలు విషయాలు వెల్లడిస్తున్నాడని తెలుస్తోంది. గంగాధరనెల్లూరు మండలం చిన్నదామరగుంటలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

   వీరికి పెళ్లి

   వీరికి పెళ్లి

   మోతరంగనపల్లెకు చెందిన కుమారస్వామిరెడ్డి తనయుడు రాజేష్‌ కుప్పం మండలంలో ప్రభుత్వ టీచర్. చిన్నదామరకుంటకు చెందిన బాబురెడ్డి కుమార్తె శైలజ(ఎంబీఏ)ను ఇచ్చి శుక్రవారం ఘనంగా వివాహం జరిపించారు.

   ఫిర్యాదుతో అరెస్ట్

   ఫిర్యాదుతో అరెస్ట్

   తొలి రాత్రిని అత్తగారింట ఏర్పాటు చేయగా అది అనుకున్నట్లుగా జరగకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిని అవమానంగా భావించిన భర్త.. భార్యపై దాడికి పాల్పడ్డాడు. శైలజ తీవ్రగాయాలతో రోదిస్తూ గది నుంచి బయటకు వచ్చింది. భర్త దారుణంగా హింసించినట్లు తల్లిదండ్రులకు తెలిపింది. వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

   కాసేపట్లోనే మొగుడి వ్యవహారం కనిపెట్టింది

   కాసేపట్లోనే మొగుడి వ్యవహారం కనిపెట్టింది

   శోభనం గదిలో రాజేష్ కిరాతకం బయటపడడానికి ముందు చాలానే నడిచిందని అంటున్నారు. ఆ రాత్రి కొద్ది నిమిషాల్లోనే వదువు శైలజ శాడిస్ట్ మొగుడి వ్యవహారాన్ని కనిపెట్టింది. అతని ప్రవర్తను బట్టి సంసారానికి పనికిరాడని నిర్ధారణకు వచ్చింది. ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు తెలిపింది. వారు రాజేష్ తల్లిదండ్రులకు విషయం చెప్పారు.

   రాజేశ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు వధువు తండ్రి ప్రయత్నం

   రాజేశ్‌కు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు వధువు తండ్రి ప్రయత్నం

   రాజేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు వధువు తండ్రి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన గురించి భార్య శైలజ అందరికీ చెప్పడంతో తన శాడిస్జ్ నైజాన్ని బయటపెట్టాడు. అంతేకాదు, తనతో పెళ్లి చేసుకున్నప్పటికీ కాపురం ఎవరితోనైనా చేసుకోమని చెప్పాడట. కానీ తన విషయం అందరికీ చెప్పవద్దని చెప్పాడు. అతని మాటలకు ఆమె ఒప్పుకోకపోవడంతో అతను సైకోగా మారాడాడు.

   English summary
   The husband pounced on his wife and started beating her indiscriminately as soon as she entered the room. He inflicted injuries with knife and kicked on her sensitive parts.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more