కాణిపాకంలో ప్రమాణం చేస్తా ; దమ్ముందా.. చంద్రబాబూ వస్తావా ? డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న నారాయణస్వామి ఇటీవల చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏ పార్టీ పొత్తులతో కాకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి గెలిస్తే తాను చంద్రబాబు ఇంట్లో పాకీ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ నేతలు సైతం నారాయణస్వామి వ్యాఖ్యలపై తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. మళ్ళీ మరోమారు చంద్రబాబుపై నారాయణ స్వామి ధ్వజమెత్తారు.

తాను అక్రమంగా సంపాదించానని నిరూపిస్తే చంద్రబాబుకు తన ఆస్తి రాసిస్తా
ఇటీవల నారాయణస్వామి టిడిపి నేతలు తాను అక్రమంగా సంపాదించానని అవాకులు చెవాకులు పేలుతున్నారని మండి పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా తాను అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే చంద్రబాబుకు తన ఆస్తి రాసిస్తానని ఆయన పేర్కొన్నారు. తన భార్య పేరుతో కొనుక్కున్న ఇల్లు తప్ప, ఇతర ఎలాంటి ఆస్తులు ఉన్న చంద్రబాబుకు రాసిస్తాను అంటూ సవాల్ చేశారు. ఇదే సమయంలో తాను అక్రమంగా సంపాదించినట్టు నిరూపించలేకపోతే చంద్రబాబు తన ఆస్తిని తనకు రాస్తారేమో చెప్పాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. తాను రాజకీయాల్లోకి వచ్చి ఇంత కాలమైనా ఎక్కడా అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అని నారాయణ స్వామి వెల్లడించారు.

తనపై వచ్చిన ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి సవాల్ చేసిన నారాయణ స్వామి
తెలుగుదేశం పార్టీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై , ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తాను కాణిపాకంలో ప్రమాణం చేస్తానని వెల్లడించారు. చంద్రబాబుకు ధైర్యముంటే ప్రమాణానికి రావాలని నారాయణస్వామి సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీల లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్న నారాయణస్వామి ఎస్సీల పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇద్దరు ఎస్సీలను అడ్డుపెట్టుకొని తనపై విమర్శలు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు నారాయణస్వామి.

చంద్రబాబును విమర్శించిన నారాయణ స్వామిపై వర్ల మండిపాటు
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిను ఉద్దేశించి ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చేసిన కామెంట్స్ పై వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ధైర్యంగా మీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో అడుగుపెట్టే దమ్ములేని పిరికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి రాజకీయ ఉద్దండుడు అయిన చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. సూర్యుడు మీద ఉమ్మేస్తున్నావ్ నారాయణస్వామి అది తిరిగి నీ ముఖం మీద పడుతుంది అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. నేల విడిచి సాము చేయొద్దని ఇక మూడు నెలల ముచ్చట మూగజీవి అంటూ వర్ల రామయ్య నారాయణ స్వామిని టార్గెట్ చేస్తూ విమర్శించారు.
Recommended Video

నారాయణ స్వామికి జవహర్ హితవు .. మళ్ళీ మొదలైన ప్రమాణాల రచ్చ
వర్ల రామయ్య మాత్రమే కాదు డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మాజీ మంత్రి జవహర్ కూడా చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పనితో సరిపోతుందని నారాయణస్వామిని ఎద్దేవా చేశారు. ఇక సవాలు చేసి పాకీపని కుదిరితే అదేపని శాశ్వతంగా మారుతుందని జవహర్ నారాయణ స్వామిని టార్గెట్ చేశారు. నారాయణస్వామి సవాళ్ళను మానేసి తన శాఖను చూసుకుంటే మంచిది అంటూ హితవు పలికారు. అంతేకాదు ముందు దళితులపై దాడులు సంగతి చూడు స్వామి, తర్వాత మా సంగతి మాట్లాడుదువు గాని అంటూ వ్యాఖ్యానించారు. ఇక మరోమారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరో అడుగు ముందుకు వేసి వ్యవహారాన్ని కాణిపాకంలో ప్రమాణాల దాకా తీసుకు వెళ్లారు. చంద్రబాబును కాణిపాకంలో ప్రమాణం చేయడానికి రావాలని ఛాలెంజ్ చేశారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications