ఆ దుస్థితిలో బీజేపీ; సినీపరిశ్రమపై మూడు కుటుంబాల ఆధిపత్యం: డిప్యూటీసీఎం నారాయణస్వామి సెన్సేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం నాడు విజయవాడలో జరిగిన బిజెపి ప్రజాగ్రహ సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. సోము వీర్రాజు ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యులకు 70 రూపాయలకు చీప్ లిక్కర్ అందిస్తామని చేసిన వ్యాఖ్యలు, బీజెపీ ని టార్గెట్ చేయడానికి ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారాయి. సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేతలు, మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు ను టార్గెట్ చేశారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలను టార్గెట్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
తాజాగా ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి తిరుపతి లో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమా టికెట్ల ధరలపై కొనసాగుతున్న వివాదంపై, అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి రాష్ట్ర బీజేపీ దిగజారిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. సోము వీర్రాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడా లేక సారాయి దుకాణాలకు అధ్యక్షుడా అంటూ మండిపడ్డారు.

ప్రజలు అనారోగ్యం పాలయ్యే మద్యాన్ని అతి తక్కువ ధరకు ఇస్తామనడం హాస్యాస్పదం
బిజెపి నేతలు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధి వంటి వాటిలో ముందడుగు వేయాలని, అలా కాకుండా ప్రజలు అనారోగ్యం పాలయ్యే మద్యాన్ని అతి తక్కువ ధరకు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేదవాడి నెత్తుటి ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపకూడదు అన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. సినిమా కూడా వారసత్వంగా అయిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు రాకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

సినీ రంగంలోని వారు జీఎస్టీ సరిగ్గా కట్టటం లేదు
సినిమా రంగంలో ఉన్న వారు జిఎస్టి సరిగా కట్టడం లేదని, నష్టపోతున్న నిర్మాతలను ఆదుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు నష్టపోయిన నిర్మాతల కోసం మరో రెండు మూడు సినిమాలు ఫ్రీగా చేయడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. టికెట్ల ధరలు ఇష్టమొచ్చినట్టుగా 2000, 3000 రూపాయలకు అమ్మడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద వారు కూడా సినిమా చూడాలంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన దీనిపై కమిటీ వేసినట్లుగా వెల్లడించారు. జగన్ ఎవరికీ వ్యతిరేకం కాదని అందరికీ మంచి చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పష్టం చేశారు.

50 ఏళ్ళుగా సినీ పరిశ్రమపై మూడు కుటుంబాల ఆధిపత్యం
50 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ పై మూడు కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుందని. కొత్త వారికి థియేటర్లు కూడా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి. రాజకీయాల్లో వారసత్వం గురించి మాట్లాడతారని, సినిమారంగంలో వారసత్వం మాటేమిటని ప్రశ్నించారు. హీరోలు తమ రెమ్యునరేషన్ ఎందుకు చెప్పటం లేదంటూ మండిపడ్డారు. బహుశా ఇలా మాట్లాడినందుకు తనను ఓడించే ప్రయత్నం చేస్తారేమో అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సెటైర్లు వేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications