వారు చెబితేనే పనులవుతాయా, పరిస్థితి చక్కదిద్దాలి- చంద్రబాబుకు పవన్ ఫిర్యాదు..!!
డిప్యూటీ సీఎం పవన్ కొందరు ఎమ్మెల్యే తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల ఆస్తి వివాదాల్లో తల దూర్చుతున్నారని.. ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ భేటీలో సూచించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా.. కూటమి ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించాలని కోరారు. పవన్ వ్యాఖ్యల పైన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ఎవరైనా ఎమ్మెల్యేలు గీత దాటితే కఠినంగా ఉండాలని.. వారి విషయంలో ఇంఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసారు.
డిప్యూటీ సీఎం పవన్ వివాదాల్లో తల దూర్చుతున్న ఎమ్మెల్యేల తీరు పైన మండిపడ్డారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో పవన్ ఈ అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే పదే చెబుతోందని.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయి. దీనిని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్ కు .. ప్రజాపాలనకు అర్థం మారిపోతుందని పవన్ అప్రమత్తం చేసినట్లు సమాచారం.

పార్టీలతో సంబంధం లేకుండా.. కూటమి ఎమ్మెల్యేలను గట్టిగా ముఖ్యమంత్రి హెచ్చరించాలని కోరారు. తాజా కేబినెట్ భేటీలో ఎమ్మెల్యేల పనితీరుపై వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. రెవెన్యూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం సూచించినప్పుడు.. భూవివాదాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంలో ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా, ఆక్రమణ లు కూడా చాలా తీవ్రమైన అంశమని, ఆయన ఆక్రమణలను స్వయంగా వీడియో తీశానని, త్వరలోనే విడుదల చేస్తానని పవన్ భేటీలో తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి.. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తుంటే ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకుని చక్కదిద్దాలని సూచించారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారమే ఎజెండాగా వారు పనిచేయాలని కోరారు. ఎర్ర చందనం విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పవన్ కల్యాణ్ బాగా చేస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. పేదలందరికీ ఇళ్లు కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. నివాస స్థలం లేని వారందరి జాబితా రూపొందించి అందరికీ ఇళ్ల స్థలాలు దక్కేలా చూడాలన్నారు.
ఏడాది కాలంలో నివాస స్థలం లేని వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని స్పష్టం చేసారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇంఛార్జ్ మంత్రులు చొరవ చూపాలని సూచించారు. విశాఖ పెట్టుబడి ల భాగస్వామ్య సదస్సు ద్వారా యువతకు మనం ఏం చేస్తున్నామో తెలియాలని చంద్రబాబు అన్నారు.
జనసేన కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలివ్వాలని మంత్రి కందుల దుర్గేశ్ కోరగా.. అది పాలసీ మేటర్ అని ఆ పార్టీకే చెందిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాగా, పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవలసిందేని సీఎం స్పష్టం చేసారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా.. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కట్టేందుకు తనకు 45 ఏళ్లు పట్టిందని చెప్పారు. ఈ విషయంలో బీజేపీ వాళ్లను అభినందించాలన్నారు. అన్ని జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications