బీజేపీపై మన వైఖరిలో మార్పు లేదు: ఎంపీలకు బాబు, అమిత్ షా రాకపోవడంపై ఆరా
Recommended Video

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలో టిడిపి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు పోరు కొనసాగిస్తున్నాయి. పార్లమెంటులో రెండో రోజు కూడా సభను అడ్డుకోవాలని నిర్ణయించాయి. ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో సభ నిర్వహించాలని భావిస్తోంది.
చదవండి: ట్విస్ట్.. కర్నూలు రెండో రాజధానిగా ఓకే, కానీ: బీజేపీకి లోకేష్ దిమ్మతిరిగే షాక్
మరోవైపు, అన్ని హామీలపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోను ఆందోళన విషయంలో తగ్గవద్దని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలకు హితబోధ చేశారు. ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అరుణ్ జైట్లీతో మాట్లాడింది బాబుకు
పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జరిగిన సారాంశాన్ని ఎంపీ తోట నర్సింహం అధినేతకు వివరించారు. అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా కేవలం రెండు అంశాల పైనే చర్చించారని, మిగతా అంశాలను వదిలేశారని టీడీపీ ఎంపీలు అధినేత దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమావేశం సంతృప్తికరంగా లేదని చెప్పారు. దీంతో ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశనం చేశారు.

స్పష్టత వచ్చే వరకు తగ్గవద్దు, అమిత్ షా ఎందుకు రాలేదు
కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు తగ్గవద్దని సూచించారు. అన్ని అంశాలపై మనకు స్పష్టత రావాల్సిందేనని తేల్చి చెప్పారు. అన్నీ సాధించే వరకు మన వైఖరిలో మార్పు లేదన్నారు. అవసరమైతే సభలో తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ ఎంపీలతో పాటు కలిసి వచ్చే ఇతర ఎంపీలను కలుపుకొని పోవాలని చెప్పారు. అదే సమయంలో భేటీకి అమిత్ షా హాజరవుతారని చెప్పారని, ఆయన ఎందుకు రాలేదని కూడా చంద్రబాబు ఆరా తీశారు. ఆయన ముందస్తు కార్యక్రమాల కారణంగా రాలేదని చెప్పినట్లు ఎంపీలు చంద్రబాబుకు చెప్పారు.

దాని పైనే పట్టు
కాగా, విభజన సమస్యలపై సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశం అసంపూర్ణంగానే ముగిసిన విషయం తెలిసిందే. తాజా భేటీలో ప్రత్యేక హోదాపైన టీడీపీ పట్టుబట్టింది. దీని కింద ఇచ్చే ఏ ఒక్క ప్రయోజనాన్నీ వదలకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బృందం దానినే ప్రధానంగా ప్రస్తావించింది.

అమిత్ షా రాలేదు
ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90%, సాధారణ విదేశీ రుణాల్లో 90% గ్రాంటు రూపంలో ఇవ్వడంతో పాటు, పన్ను రాయితీలు కల్పిస్తున్నారని, ఆ మూడు ప్రయోజనాలూ తమకు తప్పకుండా ఇవ్వాల్సిందేనని యనమల స్పష్టం చేశారు. చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానం పలికిన అమిత్ షా చర్చలకు రాలేదు. ఆయన స్థానంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏపీ ప్రతినిధి బృందంతో మంతనాలు జరిపారు.












Click it and Unblock the Notifications