బాబు-కేసీఆర్‌లపై దేవేగౌడ ఆశలు!, ప్రకాశ్ రాజ్‌కు హక్కు ఉంది కానీ: నటుడు సాయి కుమార్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తెలుగు ఓటర్లు అధికంగా ఉండంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తెలుగు ఓటర్లపై నమ్మకం పెట్టుకున్నాయి. ఈ సందర్భంగా జెడీఎస్ అధినేత దేవేగౌడ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తమను గెలిపిస్తారన్నారు.
చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు: జన్ కీ బాత్ సర్వేలో గెలుపు ఎవరిదంటే?
ఈ ఎన్నికల్లో తామే ముందంజలో ఉంటామని తెలిపారు. హంగ్ ఏర్పడుతుందని, జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని పలు సర్వేలు జోస్యం చెప్పాయి. మరోవైపు, దేవెగౌడ కుమారుడు కుమారస్వామి తాము ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కాదని, కింగేనని ఇటీవల అన్నారు. తాము సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
చదవండి: ఏబీపీ-సీఎస్‌డీఎస్ సర్వే: కర్నాటకలో హంగ్, కాంగ్రెస్‌కు 97, బీజేపీకి 84, లింగాయత్‌లు బీజేపీకే

పలు నియోజకవర్గాల్లో గెలుపోటములు ప్రభావితం
కర్ణాటకలో చాలామంది తెలుగు ఓటర్లు ఉన్నారు. చాలా ప్రాంతాల్లో వీరే అభ్యర్థుల జయాపజయాల్ని ప్రభావితం చేసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజీపీలపై చంద్రబాబు అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. అలాగే కేసీఆర్ సైతం కొత్తగా స్థానిక పార్టీలతో ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగానే అని పలు సందర్భాల్లో చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలో ప్రధాన పార్టీలు. కావున సహజంగానే తెలుగు రాష్ట్రాల సీఎంల మద్దతు తమకు ఉంటుందని దేవెగౌడ భావిస్తున్నారు.

ప్రకాశ్ రాజ్‌కు సాయి కుమార్ విజ్ఞప్తి
నటుడు ప్రకాశ్ రాజు బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా నిత్యం మాట్లాడుతున్నారు. మరోవైపు నటుడు సాయి కుమార్ బాగేపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సినిమాల్లో వీరిద్దరు మిత్రులు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రకాశ్ రాజ్ చేస్తోన్న ప్రచారంపై సాయి కుమార్ మాట్లాడుతూ.. మోడీని బ్లేమ్ చేయొద్దని ప్రకాశ్ రాజ్‌ను కోరారు. తాను, ప్రకాశ్ మంచి స్నేహితులమని, తమది ఎన్నో ఏళ్ల అనుబంధమన్నారు.

ప్రకాశ్ రాజ్‌కు అడిగే హక్కు ఉంది
సామాన్యులకు ఎవరికీ తెలియని ప్రకాశ్ రాజ్ నాకు తెలుసునని సాయి కుమార్ చెప్పారు. ప్రకాశ్ రాజ్‌లో ఎంతో ఉద్వేగం ఉందని చెప్పారు. అయితే ఎవరి సిద్ధాంతాలు వారివని చెప్పారు. జస్ట్ ఆస్కింగ్‌లో భాగంగా తాను మంచి పనులు చేయకపోతే తనను కూడా అడిగే హక్కు ప్రకాశ్ రాజ్‌కు ఉందన్నారు.

మోడీని బద్నాం చేయవద్దు
గౌరీ లంకేశ్ హత్య విషయంలో బీజేపీపై ప్రకాశ్ రాజ్ ఆరోపణల గురించి స్పందిస్తూ.. ఎలాంటి రుజువులు లేవు అన్నారు. అదే నిజమైతే చట్టాలున్నాయి కదా అన్నారు. అనవసరంగా మోడీని బద్నాం చేయడం సరికాదన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications