బాబుపై జగన్ 'చంపాలి' దుమారం: ఎస్పీకి ఫిర్యాదు, అలా కాదన్న రోజా, ఫ్యాక్షనిస్టులా.. అవినాశ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీకి జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ శుక్రవారం ఫిర్యాదు చేశారు.
నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీకి జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ శుక్రవారం ఫిర్యాదు చేశారు.

ఇవీ జగన్ చేసిన వ్యాఖ్యలు
ఉప ఎన్నికల్లో కుయుక్తులు పన్నుతున్న చంద్రబాబును కాల్చినా ఫర్వాలేదనిపిస్తోందని, ఆయన ముఖ్యమంత్రి కాదని, ముఖ్య కంత్రీ అని జగన్ దుమ్మెత్తిపోశారు. దీనిపై వారు ఫిర్యాదు చేశారు.
Recommended Video


సిగ్గులేకుండా మాట్లాడటమా, శిల్పా ఆదర్శం: రోజా
వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లిన నేతలు సిగ్గులేకుండా జగన్‌పై విమర్శలు చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. శిల్పా మోహన్ రెడ్డి, చక్రపాణి రెడ్డిలు టిడిపి నుంచి వైసిపిలోకి వచ్చి పార్టీలు మారే వారికి ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు.

జగన్‌కు సమర్థన, రోజా వివరణ
జగన్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని రోజా చెప్పారు. అసెంబ్లీ వేదికగా కాల్చి పారేస్తాం, అంతు చూస్తాం, పాతరేస్తాం అంటే ఎవరూ పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. చంద్రబాబును నిలదీయాలి అన్న అర్థంలో జగన్ మాట్లాడితే తప్పు పడతారా అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అవినాష్ కూడా ఫిర్యాదు
జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టిడిపి నేత దేవినేని అవినాశ్ కూడా శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపాలి, నరకాలి అనడం దుర్మార్గమైన చర్య అన్నారు. జగన్ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన జగన్ అలాంటి మాటలు మాట్లాడటం విడ్డూరమన్నారు. విజయవాడలో జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications