లగడపాటిపై దేవినేని: జగన్-కాంగ్‌కు కెవిపి బ్రోకరని వర్ల

జూలై 28న లగడపాటికి చెందిన ల్యాంకో ఇన్‌ఫ్రాకు కేంద్రం కోల్ మైన్‌ను కేటాయించిందని, రూ.33 వేల కోట్ల అప్పుల్లో ఉన్న ల్యాంకోకు కోట్లాది రూపాయలు రీషెడ్యూల్ చేసేందుకు ఢిల్లీ పెద్దలు అంగీకరించారని ఆరోపించారు. కొందరు ఎంపీలు కేంద్రం తొత్తులుగా మారడం విడ్డూరమన్నారు. ఉద్యమంలోకి దొంగచాటుగా వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావును ఎందుకు అరెస్టు చేయలేదని మరో నేత వర్ల రామయ్య వేరుగా అన్నారు. టెన్ జన్‌పథ్, లోటస్‌పాండ్‌కు మధ్య కెవిపి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసుకు మధ్య బ్రోకర్‌గా ఉన్నందుకే కెవిపిని సిబిఐ వదిలేస్తోందన్నారు. జగన్ ఆస్తుల కేసులో అప్పటి జెడి లక్ష్మీ నారాయణ దర్యాఫ్తును కొనసాగించడంలో సిబిఐ విఫలమైందన్నారు. హైకోర్టు చెప్పినా సిబిఐ ఎందుకు కెవిపిని వదిలేసిందో అర్థం కావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications