కావాలనే కల్తీ మద్యం కేసులో ఇరికించారు: మల్లాది విష్ణుకు నెహ్రూ మద్దతు

అమరావతి: విజయవాడలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణును కావాలనే ఇరికించారని కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని నెహ్రూ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలో విష్ణు తప్పులేదని తేలిందని ఆయన వెల్లడించారు. కాగా, విజయవాడ కృష్ణలంకలో కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు కూలీలు మృతి చెందగా, 25 మంది వరకు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన సిట్ స్వర్ణబార్‌లో మద్యంలో కల్తీ జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చడంతో బార్‌లో పనిచేస్తున్న మేనేజర్‌తో సహా మొత్తం 9మందిని అరెస్ట్ చేసింది.

Devineni Nehru support to malladi vishnu in Adulterated alcohol case

ఇటీవలే సిట్ ముందు విచారణకు హాజరైన మల్లాది విష్ణుతో పాటు ఆయన సోదరుడు మల్లాది శ్రీనివాస్‌ను కూడా అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మల్లాది విష్ణు, అతని సోదరుడు శ్రీనివాస్‌కు జైలులో ఉన్నారు. కాగా ఈ కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను మంగళవారం విచారించిన విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 9 మంది బార్ సిబ్బందికి బెయిల్ మంజూరు చేసింది.

అయితే మల్లాది విష్ణు సోదరులకు మాత్రం బెయిల్ మంజూరు చేయలేదు. కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు అరెస్టైన తర్వాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉంటున్న ఏపీ కాంగ్రెస్ నేతలు నెమ్మదిగా విష్ణుకు మద్దతుని తెలుపుతున్నారు. మల్లాది విష్ణు అరెస్ట్ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు గత శనివారం రఘువీరాతో పాటు కేవీపీ, సీ రామచంద్రయ్యలు శనివారం ఉదయం బెజవాడకు వచ్చారు.

దీంతో మల్లాది విష్ణు అనుచరులు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎదుట ఆందోళన చేపట్టారు. కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణుకు ఎలాంటి సంబంధం లేకున్నా అధికార పక్షం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంటే, చూస్తూ ఎలా ఊరుకుంటారని కూడా వారు పార్టీ సీనియర్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+