"జగన్ పారిపోయారు: ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్‌లోనే.. "
విజయవాడ/ అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుతో పాటు తెలుగుదేశం నాయకురాలు పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని జగన్ దింపకపోవడంపై అనురాధ వ్యాఖ్యలు చేయగా, జగన్ ప్రజా సంకల్ప యాత్రపై దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. జగన్ ప్రజా సమస్యలపై కాకుండా ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్‌లో వెళ్తున్నారని ఆయన అన్నారు.

జగన్ అందుకే పారిపోయారు..
ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని అన్నారు. అందుకే కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయారని ఆమె వ్యాఖ్యానించారు.
Recommended Video


ఆ విషయం జగన్‌కు తెలుసా...
ప్రజాస్వామ్యమంటే ఏమిటో జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు తెలుసా అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. పోటీ చేయకుండా పారిపోయిన వైసీపీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కులేదని అన్నారు. వైసీపీ దృష్టిలో పారిపోవడమే ప్రజాస్వామ్యమా అని ఆమె అడిగారు. అసెంబ్లీలో కూడా ఉండలేక వైసీపీ పారిపోయిందని అన్నారు.

అధికారం దక్కలేదనే అక్కసుతో..
అధికారం దక్కలేదనే అక్కసుతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరి కాదని మంత్రి దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ దివాలా తీసిందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ పథకాలపై ఇలా..
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను దేవినేని ఉమ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. జన్మభూమి, మాఊరు, ఇంటింటికి టీడీపీలో అందిన అర్జీలన్నీ జనవరి 2వ తేదీ నుంచి పరిష్కరిస్తామని చెప్పారు.పట్టిసీమ నుంచి 105 టీఎంసీలు కృష్ణా జలాలు రావడంతో రాయలసీమకు ఊరట కలుగుతుందని ఆయన చెప్పారు.

దివాళాకోరు తనమేనని...
కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి పోటీ చేయకపోవడం దివాలాకోరుతనమేనని డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. వైసీపీ నిర్ణయంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ ఎన్నిక జరిగితే కేఈ ప్రభాకర్ భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆయన అన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications