బెంగళూరులో తన ప్యాలెస్ లు కాపాడుకోవటానికి ఆల్మట్టి డ్యాం ఎత్తుపై జగన్ సైలెంట్ : దేవినేని ఉమా ధ్వజం
రోడ్ల దుస్థితి పై జనసేన, టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు వినాయక చవితి నిర్వహించాలని బిజెపి ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇంకోవైపు పెన్షన్లు, ప్రాజెక్టుల విషయంలోకూడా జగన్ సర్కార్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్ష టీడీపీ. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్నా జగన్ మౌనం
ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరుపై దేవినేని ఉమా ధ్వజమెత్తారు. బెంగళూరులో ఉన్న తన ప్యాలెస్ ను కాపాడుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నా ఏపీ సీఎం జగన్ పట్టించుకోవడంలేదని దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టే అధికారం ఆయనకు ఎవరిచ్చారని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఈరోజు టిడిపి పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన దేవినేని ఉమా పోలవరం ప్రాజెక్టు పనులపై వైసిపి డబ్బాలు కొట్టుకుంటే సరిపోదని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా ?
బహుళార్థసాధక ప్రాజెక్టును రూ .913 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చానని పేర్కొన్న దేవినేని ఉమా లిఫ్ట్ పనులకు సంబంధించిన టెండర్లు ఎవరికి కట్టబెట్టారో చెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తుందని, సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను ఎంత వరకు చేశారో చెప్పగలరా అంటూ దేవినేని ఉమా ప్రశ్నించారు. పోలవరం పనుల వివరాలను తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ దేవినేని ఉమా అధికార వైసీపీని ప్రశ్నించారు.

ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా జగన్ మొద్దు నిద్ర పోతున్నారు
తెలుగుదేశం పార్టీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 71% పూర్తయ్యాయని పేర్కొన్న ఉమా ఇప్పుడు వైసీపీ హయాంలో జరిగిన పనులేవో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసింది నిజం కాదా అంటూ దేవినేని ఉమా నిలదీశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు దాదాపు ఐదున్నర మీటర్ల మేర పెంచి 18 అడుగుల మేర గేట్ల నిర్మాణం చేస్తుంటే సీఎం జగన్ మొద్దు నిద్ర పోతున్నారని విమర్శించారు.బాధ్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిర్మించే అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపని జగన్
కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోయినా సీఎం జగన్మోహన్ రెడ్డి లో కనీస స్పందన లేదని దేవినేని ఉమా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రోజురోజుకీ పెరుగుతున్న జల వివాదాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ 50 శాతం నీళ్ల వాటా కావాలని ఢిల్లీలో మకాం వేసి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలుస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని దేవినేని ఉమా నిలదీశారు. అంతరాష్ట్ర ప్రాజెక్టుల పరిరక్షణపై ఏనాడైనా అధికారులతో సమీక్ష జరిపారా అని ప్రశ్నించిన దేవినేని ఉమా జల వివాదాల విషయంలో జగన్ మౌనం వెనుక తన ప్యాలెస్ లను, ఆస్తులను కాపాడుకునే స్వార్థం ఉందని ధ్వజమెత్తారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications