మీది పౌరుషమా? ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై దేవినేని ఉమ తీవ్రవ్యాఖ్యలు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా టిడిపి వైఎస్సార్సిపి నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రజాక్షేత్రంలోకి వెళుతూ బస్సు యాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయవాడ రూరల్ మండలం నున్నలో జరుగుతున్న టీడీపీ బస్సు యాత్రలో మాజీ మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా వైసిపి ఎమ్మెల్యేల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ల పై మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచిన నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ అంటూ దేవినేని ఉమా నిప్పులు చెరిగారు.

Devineni Uma harsh comments on MLAs Kodali Nani and Vallabhaneni Vamsi

కృష్ణాజిల్లా పౌరుషాల గడ్డ అని, అటువంటి చోట ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తీరుతో గుడివాడ, గన్నవరం పేర్లు చెప్పుకోవాలంటేనే ప్రజలు సిగ్గు పడుతున్నారని ఆయన ఆక్షేపించారు. గన్నవరం, మైలవరం నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్ తో కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని దేవినేని ఉమ ఆరోపించారు. కొండలు, గుట్టలను తవ్వి పోసి కోట్లకు కోట్లు ఆర్జించారని ఆయన మండిపడ్డారు.

వైసీపీ పాలనలో దోపిడీ, అరాచకం తప్ప ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ దేవినేని ఉమా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీలో గెలిచి ప్రాణభయంతో జగన్ పంచన చేరిన వ్యక్తి వల్లభనేని వంశీ అని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ ని ప్రశ్నించిన దేవినేని ఉమా పట్టిసీమ నీళ్లు తెచ్చారా? పట్టిసీమ నీళ్లు తేలేని గన్నవరం ఎమ్మెల్యే వంశీ అసమర్ధుడు కాదా మండిపడ్డారు.

వల్లభనేని వంశీ భయంతో బతుకుతున్నాడని, అయితే భయమనేది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు డిఎన్ఎ లో కూడా లేదని దేవినేని ఉమా పేర్కొన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హింసిస్తున్నారని దేవినేని ఉమా అసహనం వ్యక్తం చేశారు. కార్లలో వచ్చి అమాయకులైన నాయకులను, కార్యకర్తలను భయపెడుతూ బతుకుతున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు.

పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావుడు ఎమ్మెల్యేగా పనిచేసిన గన్నవరంలో వంశీ రౌడీ రాజ్యం అవసరమా అంటూ ప్రశ్నించారు. బచ్చుల అర్జునుడు చావుబతుకుల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యాలయంపై దాడి చేస్తారా? ఇది మీ పౌరుషమా అంటూ దేవినేని ఉమ ప్రశ్నించారు. ఇళ్లలోకి చొరబడి, బెడ్రూమ్ లోకి వెళ్లి ఆడపిల్లలను లాక్కొని వస్తారా అంటూ దేవినేని ఉమా నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+