లేఖలో ఏముందో చూసుకోకుండా సంతకం, ఇదీ జగన్ అంటే: దేవినేని

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నిప్పులు చెరిగారు.

Recommended Video

    లేఖలో ఏముందో చూసుకోకుండా సంతకం, ఇదీ జగన్ అంటే

    విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం నిప్పులు చెరిగారు.

    పాదయాత్ర పేరుతో ఓ అవినీతి అనకొండ ప్రజల్లోకి వస్తోందని విమర్శించారు. జగనన్న వస్తున్నాడని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్నారని, కానీ వచ్చేది మాత్రం అవినీతి అనకొండ అని ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పారు.

    లేఖలో ఏముందో కూడా జగన్ చూసుకోలేదు

    లేఖలో ఏముందో కూడా జగన్ చూసుకోలేదు

    రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతులంతా సంతోషంగా ఉంటే జగన్ ఓర్వలేని తనంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని దేవినేని విమర్శించారు. ఎవరో రాసిన లేఖలపై జగన్ సంతకాలు చేస్తున్నారని, అందులో ఏం ఉందనేది కూడా చూసుకున్నట్లుగా లేదన్నారు.

    ఓ విదేశీ యాత్ర, ఓ భేరీ, ఓ లేఖ.. ఇదీ జగన్

    ఓ విదేశీ యాత్ర, ఓ భేరీ, ఓ లేఖ.. ఇదీ జగన్

    రుణమాఫీ చేస్తుంటే తట్టుకోలేక అమలు కావడం లేదంటూ జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని దేవినేని విమర్శించారు. ఓ విదేశీ యాత్ర, ఓ భేరీ, ఓ ఉత్తరం ఇదే జగన్ చేసే పని అని ఎద్దేవా చేశారు. వర్షాలు పడకూడదని జగన్‌ హైదరాబాద్‌లో కూర్చుని ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కడం లేదన్నారు.

    జగన్ కోర్టుకెళ్లడం దురదృష్టకరం

    జగన్ కోర్టుకెళ్లడం దురదృష్టకరం

    రాష్ట్రంలోని డ్యాములన్నీ నిండుతున్నాయని, మంచి వర్షాలు పడుతున్నాయని దేవినేని అన్నారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.265 కోట్లు ఇచ్చి అక్కడ 18 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని, వంశధార స్టేజ్ 2 ప్రాజెక్టును తాము నిర్మిస్తుంటే జగన్‌ కోర్టుల కెళ్తుండడం దురదృష్టకరమన్నారు.

    అప్పుడు పట్టిసీమ అన్నారు, ఇప్పుడు

    అప్పుడు పట్టిసీమ అన్నారు, ఇప్పుడు

    రాయలసీమ జలసీమగా మారిందని, పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు 78 టీఎంసీలు మళ్లించామని దేవినేని చెప్పారు. ఒకప్పుడు పట్టిసీమను ఒట్టిసీమ అన్న జగన్‌ ఇప్పుడేమంటారో సమాధానం ఇవ్వాలని నిలదీశారు. లేదంటే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

    పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ఏపీ ప్రభుత్వంపై బురద

    పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ ఏపీ ప్రభుత్వంపై బురద

    జగన్ పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ అక్కడ పత్రికలు చూస్తూ ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. హైదరాబాదులో ఉండి ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+