Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ ఫ్రస్టేషన్ అందుకే..! జగన్ అమరావతి రావాలన్న దేవినేని ఉమ..!

ఏపీలో ఓవైపు సూపర్ సిక్స్ పథకాల అమలు నిరాటంకంగా కొనసాగుతుండటంతో వైసీపీలో అసహనం పెరిగిపోతోందని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతిలో వరదల పేరుతో వైసీపీ, అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. జగన్ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనలో ఓటమి భయం, మానసిక అసహనం ఈ స్థాయికి చేరిందన్నారు.

రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ నాయకులు, వారి అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. అమరావతిలో 52వేల కోట్లతో జరుగుతున్న నిర్మాణాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు బ్లూ మీడియా సహకారంతో విషప్రచారం చేస్తున్నారన్నారు. ఎక్కడో వాగులు పొంగిన దృశ్యాలను తీసుకువచ్చి అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడంలేదని, కొండవీటి వాగు నీటితో పంటలు మునిగిపోయాయని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ఇరిగేషన్ శాఖ అధికారులు వాటిని ఖండిస్తూ ఫిర్యాదులు చేశారన్నారు.

devineni uma reveals reason behind ys jagan s frustration slams Amaravati sunk propaganda

జగన్మోహన్ రెడ్డికి నిజంగా ధైర్యం ఉంటే అమరావతి వచ్చి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూసి వెళ్ళాలని దేవినేని ఉమ ఆహ్వానం పలికారు. అక్కడ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పర్యవేక్షించి తెలుసుకోవాలన్నారు. కానీ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని లేదా బెంగళూరు ప్యాలెస్‌లో సత్కారాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వేరే పని చేయడం లేదన్నారు.

చంద్రబాబు సర్కారు ప్రారంభించిన 'సూపర్ సిక్స్' పథకాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమవుతున్నాయని, రైతులు, మహిళలు, పింఛన్ దారులు అందరూ లబ్ధి పొందుతున్నారని ఉమా తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, గ్యాస్ సిలిండర్లు, విద్యా పథకాలుఇవన్నీ ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని, మహిళలు సోషల్ మీడియాలో తమ ఖాతాల్లో డబ్బులు పడుతున్న వీడియోలు పంచుకుంటుంటే జగన్ తట్టుకోలేక అసహనంతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఉమ విమర్శించారు.

devineni uma reveals reason behind ys jagan s frustration slams Amaravati sunk propaganda

దేశమంతటా అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ పతాకాలు ఎగురవేస్తున్న వేళ, జగన్ మాత్రం ప్రజల ముందుకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో తలదాచుకున్నారని ఉమ విమర్శించారు. మరోవైపు అమరావతి మునిగిపోయిందంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేసే బ్లూ మీడియా, సోషల్ మీడియా పేజీలపై ప్రభుత్వం ఇప్పటికే కేసులు నమోదు చేసిందని దేవినేని ఉమా గుర్తుచేశారు. ఇకపై కూడా ఎవరైతే ఇటువంటి ఫేక్ న్యూస్ వ్యక్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+