బూతుల మంత్రులు, సన్నాసిలు.. దేవినేని ఉమ ధ్వజం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. సీఎం జగన్, మంత్రులు, సజ్జల లక్ష్యంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీలో బపూన్, సన్నాసి, బూతుల మంత్రులు ఉన్నారని తెలిపారు. సీఎం జగన్‌కు ధైర్యం ఉంటే ఢిల్లీ పర్యటన వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో సీఎం జగన్, డీజీపీ పరిపాలన చేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు. ఈ దుర్మార్గపు పరిపాలన ఎక్కువ కాలం నడవద్దన్నారు. బిహార్‌లో కూడా ఇంత దుర్మార్గపు పాలన లేదన్నారు. పక్క రాష్ట్ర సీఎంతో లాలూచీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్లకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని దేవినేని ఉమా ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ అరాచక పాలన చేస్తుందని విమర్శించారు. జరిగే ఘటనలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

టీడీపీ నుంచి వెళ్లిన వారికి ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని దేవినేని ఉమ స్పస్టంచేశారు. ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. వైసీపీలో బఫూన్, సన్నాసి, బూతుల మంత్రులున్నారని ఆరోపించారు. అందుకే వారు అలా మాట్లాడుతున్నారని చెప్పారు. సీఎం జగన్ పదే పదే ఢిల్లీ పర్యటన చేయడంలో ఆంతర్యం ఏమిటని అడిగారు. దమ్ము, ధైర్యం ఉంటే హస్తిన టూర్ వివరాలు తెలియజేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
-
ఏపీలోకి తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు-చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications