భక్తులు జైల్లో.. అరాచకశక్తులు బయట?: మాజీమంత్రి దేవినేని ఉమ ఫైర్..
ఏపీ ప్రభుత్వంపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఎన్నడూ లేనివిధంగా వింత ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులు జైల్లో ఉంటే అరాచకశక్తులు రోడ్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. ఏడాది కాలంలో జగన్ సర్కార్ చేసిన అరాచకాలను ఎండగట్టారు. టీడీపీ నేతల వేధింపులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
వినాయక చవితి వేడుకలకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని గుర్తుచేశారు. కానీ కొందరు ప్రభుత్వ పెద్దల పుట్టినరోజు వేడుకలకు మాత్రం ప్రోత్సాహకాలు ఇస్తారా అని దేవినేని ప్రశ్నించారు. జీవోలు ఇచ్చి హడావిడి చేయడం ఏంటీ అని అడిగారు. ఇదీ సరికాదు అని.. తీరు మార్చుకోవాలని కోరారు. దీంతోపాటు ఆలయ ఘటనలను దేవినేని ప్రస్తావించారు. ఆలయ ధ్వంసానికి సంబంధించి ఘటనలను సీఎం జగన్ ఎందుకు ఖండించడం లేదు అని అడిగారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమ అడిగారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఘటనుల జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు 80 ఘటనలు జరిగాయన్నారు. తొలుత సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకుంటే ఘటనలు జరిగేవీ కావన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో వెండి ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు చోరీకి గురైన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాలు కూడా ధ్వజమెత్తారు.
ఇటీవల అంతర్వేది రథం దగ్ధమయిన సంగతి తెలిసిందే. దానిపై సీబీఐ విచారణకు ఆదేశించారో లేదో.. అమ్మవారి వెండి సింహాలు అపహరణకు గురయ్యారు. దీంతోపాటు నిన్న సాయిబాబ విగ్రహాం, ఇవాళ హనుమాన్ విగ్రహా ధ్వంసమయ్యాయి. దీంతో హిందూసంస్థలు భగ్గుమంటున్నాయి.
Recommended Video
రాష్ట్రంలో ఎప్పుడూలేని వింతపోకడలు, భక్తులు జైల్లోఉంటే అరాచకశక్తులు రోడ్లపైనా? చవితివేడుకలకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం, పుట్టినరోజు వేడుకలకు మాత్రం ప్రోత్సాహకాలతో జీవోలతో హడావుడా? ఆలయ ఘటనలను ముఖ్యమంత్రి ఎందుకు ఖండించడంలేదని అడుగుతున్న @ncbn మాటలకు సమాధానం చెప్పండి @ysjagan pic.twitter.com/XbH4emVfoP
— Devineni Uma (@DevineniUma) September 17, 2020
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications