మీరు సూపర్బ్, బెజవాడలో మా ఇంటికి రండి: ఏపీ మంత్రి, టీ కాంగ్రెస్ చీఫ్

హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య సోమవారం నాడు ఆసక్తికర సంభాషణ సాగింది. ఏపీ, తెలంగాణ శాసన సభలు జరుగుతున్న విషయం తెలిసిందే.

సోమవారం ఇరు రాష్ట్రాల సభల అనంతరం ఇరువురు నేతలు బయటకు వచ్చారు. ఉత్తమ్, దేవినేనిలు ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఈ సమయంలో వారిద్దరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి దేవినేనికి ఉత్తమ్ కితాబిచ్చారు.

Devineni welcomes Uttam to Vijayawada

పక్క పక్కనే ఉన్న నియోజకవర్గాల వాళ్లమని, కాబట్టి కలిసి ఉండాలని ఉత్తమ్ చెప్పారు. దానికి దేవినేని సానుకూలంగా స్పందించారు. ఎప్పుడైనా విజయవాడకు వస్తే తమ ఇంటికి రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి దేవినేని సూచించారు. కాగా, ఈ నెల 7వ తేదీన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+