బ్లాక్ మని గోవిందా గోవిందా: హుండీలో కానుకలు !

తిరుమల: కేంద్ర ప్రభుత్వం రూ. 1,000, రూ. 500 నోట్లు రద్దు అయిన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎలాంటి ఆందోళన చెందరాదని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన విభాగం అధికారులు అన్నారు. రూ. 500, రూ. 1,000 నోట్లు చెల్లవని, చిల్లర లేదని మీరు ఆందోళన చెందరాదని ఉచితంగా భోజనం, మంచి నీరు అందిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.

భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుమల కొండ మీద ఉన్న బ్యాంకుల్లో నగదు మార్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు రూ. 500, రూ.1,000 నోట్లు హుండిలో వేసి స్వామి వారికి ముక్కు తీర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.

అంతే కాకుండ తిరుమల కోండకు చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు సులభంగా బ్యాంకుల్లో నోట్లు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు వివరించారు. స్వామి వారికి సమర్పించే కానుకలను నిత్యం లెక్కించి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు.

Devotees to Tirumala get free food, water after 1000, 500 rupee notes banned

అయితే భవిష్యత్తులో వచ్చే రూ. 500, రూ.1,000 నోట్ల మార్పిడికి ఎలాంటి ప్రతిభందన ఉండదనే అభిప్రాయానికి వచ్చారు. రిజర్వు బ్యాంకు ద్వారా ఆ నోట్లను మార్చుకునే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

ఈ సమయంలో స్వామి వారికి పెద్ద ఎత్తున కానుకలు (రూ.1,000, రూ.500నోట్లు) వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఇదే సమయంలో ఆన్ లైన్ సేవలకు అంతరాయం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

టీటీడీ విరాళాలు చెల్లింపుకు ఇటీవలే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ డోనేషన్ విధానం కింద శ్రీవారి ట్రస్టుకు డిపాజిట్ చెల్లించుకునే సౌలభ్యం ఉంది. వీటి పట్ల భక్తులకు ఆకర్షణ పెరుగుతుందని అధికారులు అభిప్రాయానికి వచ్చారు.

Devotees to Tirumala get free food, water after 1000, 500 rupee notes banned

ఈ విషయంలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ తరువాత శ్రీవారి హుండీ, ఈ -డోనేషన్ విరాళాలు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

నల్లధనంతో శ్రీవారి హుండీ ఆదాయం పెరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

భారీ మొత్తంలో నోట్లు నిల్వ చేసుకున్న వ్యక్తలు వాటిని మార్చుకోవడానికి ఇబ్బందులు ఎదురైన సమయంలో వాటిని శ్రీవారి హుండిలో కానుకలుగా సమర్పించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+