తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆందోళన... అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశి గురువారం వస్తుండటం... కొత్త సంవత్సరం.. జనవరి ఒకటో తేదీ.. అన్నీ కలిసి రావడంతో సామాన్య భక్తులు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

దీంతో తమకు బుధవారం నుంచే వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతించాలని భక్తులు తిరుమలలోని సీజీసీ వద్ద ఆందోళనకు దిగారు. ఐతే బుధవారం సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే భక్తులను వైకుంఠ ఏకాదశి దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. దాంతో అధికారులకు, భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Devotees want to go in queue line for tomorrows darshan in tirumala

ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో సర్వదర్శనం మినహా అన్ని దర్శనాలను రద్దు చేశారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ద్వారం నుంచి భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల దేవదేవుడు బంగారు రథంపై తిరుమల మాడవీధుల్లో విహరించనున్నారు.

English summary
Devotees want to go in queue line for tomorrows vikunta ekadasi darshan in tirumala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X