బయటపడ్తాయి: సిబిఐ దర్యాఫ్తుపై స్పందించిన దినేష్
హైదరాబాద్: తన ఆస్తులపై సిబిఐ విచారణ దర్యాఫ్తుపై డిజిపి దినేష్ రెడ్డి గురువారం స్పందించారు. సిబిఐ విచారణలో అన్ని అంశాలు బయటపడతాయన్నారు. తాను డిజిపి కావడానికి ముందే తనపై పలువురు హోంశాఖకు ఫిర్యాదులు పంపారని, అందులో ఫిర్యాదుదారు పేరు లేకపోవడంతో వాటిని పక్కన పెట్టారన్నారు.
ఓ పార్లమెంటు సభ్యుడి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి తనపై ఫిర్యాదు చేశారని చెప్పారు. తనకు డిజిపి పదవి రాకుండా చేసేందుకు పలు పిటిషన్లు వేశారని చెప్పారు.

కాగా, డిజిపి దినేష్ రెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. దినేష్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)ని నమోదు చేసినట్లు సిబిఐ వర్గాలంటున్నట్లు బుధవారం వార్తలు వచ్చాయి.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై దినేష్ రెడ్డిపై విచారణకు సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఐపిఎస్ అధికారి ఉమేష్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు సుప్రీం కోర్టు దినేష్ రెడ్డిపై వచ్చిన ఆరోపణల మీద విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications