ముంబాయి నటి కేసులో క్లూ ఇచ్చిన డీజీపీ, తప్పు చేసింది ఎవరైనా సరే ?

ప్రజల కోసం పనిచేయడానికి పోలీసులు అందరూ సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. బుధవారం ఏలూరులో మీడియాతో మాట్లాడిన డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీసుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని, అందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు.

లైంగిక దాడులను నివారించేందుకు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. ముంబాయి నటి కేసులో ప్రాథమిక విచారణ పూర్తి అయ్యిందని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. ముంబాయి నటి ఫిర్యాదు మేరకు కొంతమంది పోలీస్ అధికారులు అధికారులపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయించామని, ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశామని, ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు.

DGP Dwaraka Tirumala Rao said that people are ready to work for the people

ముంబాయి నటి కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి సమాచారం ఇప్పుడే బయటకు చెప్పడం వీలు కాదని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ముంబాయి నటి కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉందని, ఈ కేసులో తప్పు చేసిన వారు పోలీసులు అయినా, రాజకీయ నాయకులైనా సరే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

ముంబాయి నటి కేసులో దర్యాప్తు వేగవంతంగానే జరుగుతోందని, ఈ కేసులో పోలీసులు పైన ఎలాంటి ఒత్తిడి లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు, ముంబాయి నటి కేసులో బాధితులకు న్యాయం చేస్తామని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారు తప్పించుకోలేరని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఎస్ హెచ్ వోలకు ఇన్వెస్టిగేషన్ చార్జీలు రాలేదని ఇప్పటికే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

పోలీస్ క్యాంటీన్లకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ 4.7 కోట్లు ఇచ్చామని, పోలీస్ క్యాంటీన్లను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న అనేక కేసుల దర్యాప్తు వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మొత్తం మీద ముంబాయి నటి కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తోందని స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు ఓ క్లారిటీ ఇవ్వడంతో ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వైసీపీ నాయకులు, పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+