Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి వెళ్లి పొమ్మంటే ఏం చేస్తాం ? చంద్రబాబు పథకాలు తీసేస్తాడు-ధర్మాన కామెంట్స్

ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా సాగుతున్న రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబునూ ఆయన టార్గెట్ చేశారు.

శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలిగ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గోన్న రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇవాళ చంద్రబాబు, అమరావతి రాజధానిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం డబ్బంతా హైదరాబాద్ లో పెట్టాం ..వాళ్లు వెళ్లిపొమ్మన్నారు, రేపు రాష్ట్ర సంపదంతా అమరావతిలో పెడితే వారు వెళ్లిపొమ్మంటే ఏం చేస్తామని ఉత్తరాంధ్ర వాసుల్ని ప్రశ్నించారు. అన్ని రకాలుగా అభివృద్ది చెందిన ప్రాంతం విశాఖ అని, విశాఖని రాజధానిగా చంద్రబాబు వద్దంటున్నారని ధర్మాన ఆరోపించారు.

dharmana prasadarao ask what if amaravati send us out, says chandrababu remove schemes

రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు అమరావతిని సృష్టించారని ధర్మాన ఆరోపించారు. విశాఖ రాజధాని వద్దంటూ యాత్ర మోదలు పెట్టారని, ప్రజల తిరుగుబాటు చూసి తోక ముడిచి వెళ్లిపోయారన్నారు. యాత్ర గురించి మాట్లాడటమే మానేసి, అక్కడ ఇక్కడ అన్యాయం అయిపోయిందంటున్నారని ధర్మాన విమర్శించారు. అన్యాయాలకి అడ్రస్ టీడీపీ, చంద్రబాబులే ..నువ్వు అన్యాయాల గురించి చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తారని, ముందు ఆంద్ర ప్రదేశ్ లో సెటిలై అప్పుడు మాట్లాడు చంద్రబాబూ అని ధర్మాన సూచించారు.

dharmana prasadarao ask what if amaravati send us out, says chandrababu remove schemes

అందరిని కూడగట్టి అధికారంలోకి రావాలనుకుంటున్నావ్ .. అది సాద్యంకాదని చంద్రబాబు, పవన్, బీజేపీని ఉద్దేశించి ధర్మాన వ్యాఖ్యానించారు. టీడీపీ ఐదేళ్లలో ఓక్క పథకమైనా న్యాయంగా ఇఛ్చారా అని ధర్మాన ప్రశ్నించారు. ఫథకాలపై ఆరోపణలు చేస్తావ్ , మరాలా మేం అధికారంలోకి వస్తే అన్ని కొనసాగిస్తానంటావ్... ఇదేం మాయ మాటలన్నారు. రోడ్లకి కన్నాలు పడితే కారణం మీరేకదా ..మీ ఐదేళ్లలోమంచి రోడ్లు వేస్తే .. ఈ పరిస్తితి ఉండేది కాదుగా అని ధర్మాన వ్యాఖ్యానించారు. చంద్రబాబు మళ్లీ వస్తే అన్ని పథకాలు తీసేస్తాడన్నారు. రాష్ట్రంలోనే లేని నీకు రాష్ట్రంతో సంబంధం ఏంటి చంద్రబాబూఅని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+