'ఆ దమ్ము టీడీపీకి లేదు.. గెలుస్తామన్న నమ్మకం లేకే బెదిరింపులు'
ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్చగా జరిగితే గెలవలేమన్న అపనమ్మకంతోనే నామినేషన్లు వేసిన ఇతర పార్టీల వారిపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారని ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం: అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బెదిరింపులు, అసెంబ్లీ నిర్వాహణ వంటి అంశాలపై ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.
రాష్ట్రంలో ఉపఎన్నికలకు వెళ్లేంత దమ్ము టీడీపీకి లేదని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అసెంబ్లీ నిర్వహణ తీరును తప్పుబడుతూ.. పక్కనే ఉన్న తెలంగాణలో 75రొజులు, ఒడిశాలో 85రోజులు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం పూర్తి రోజులు సభ ఎందుకు నడపలేకపోతున్నారని ధర్మాన ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్చగా జరిగితే గెలుస్తామన్న నమ్మకం లేకనే నామినేషన్లు వేసిన ఇతర పార్టీల వారిపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారని ధ్వజమెత్తారు. ఇక మంత్రివర్గ విస్తరణ గురించి ప్రస్తావిస్తూ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారికి మంత్రిపదవులు కట్టబెడుతామనడం అవమానకరమని వ్యాఖ్యానించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. రాష్ట్రంలో ఒక్క ఎన్నిక కూడా నిర్వహించలేదని ధర్మాన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications