ఆసుపత్రి వద్ద ధర్నా
నెల్లూరు: కాన్పు సమయంలో కడుపులో గుడ్ద పెట్టి కుట్లు వేసిన ఘటనలో బాధితులు ఆందోళన బాట పట్టారు. నెల్లూరు నగరంలోని సింహపురి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి క్లాత్ తీసినప్పటికీ ఆపరేషన్ కు సంబంధించిన రిపోర్టు ఇవ్వాలంటూ బాధిత లక్ష్మీ శ్రావణి బంధువులు హాస్పటల్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. సులోచనమ్మ నర్సింగ్ హోమ్, సింహపురి హాస్పిటల్ కుమ్మకై ఆపరేషన్ రిపోర్ట్స్ ఇవ్వడంలేదంటూ బాధితురాలు లక్ష్మీ శ్రావణి భర్త రమేష్ ఆరోపిస్తున్నారు. రిపోర్ట్స్ ఇచ్చే దాకా ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. ప్రయివేట్ హాస్పటల్స్ నిరుపేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఆపరేషన్ చేసిన బిల్లు కాగితాలు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వడంలేదో అర్దంకావడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రయివేట్ హాస్పటల్స్ పై డిఎంహెచ్ వో పర్యవేక్షణలేదని తద్వారా ప్రయివేట్ హాస్పటల్స్ యథేశ్చగా దోచుకుంటున్నాయని బాధిత బంధువులు వాపోతున్నారు.












Click it and Unblock the Notifications