ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నాలతో మార్మోగింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ వర్గాల ప్రజలు ధర్నాకు దిగారు. రొయ్యల పరిశ్రమ నిమిత్తం కుప్పిలిలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు ధర్నా చేశారు. తక్షణం భూకేటాయింపులు రద్దు చేయాలన్నారు. అలాగే సమస్యలు పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకందారులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారు నినాదాలతో హోరెత్తించారు.












Click it and Unblock the Notifications