Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ జగన్ సొంత జిల్లాలో వజ్రాల గనులు : కడప డైమండ్ మైన్స్ పై సర్వే నివేదిక ; ఏపీ పంట పండినట్టేనా !!

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలలో వజ్రాల వేట కొనసాగుతుంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలలో వజ్రాలు దొరికిన అనేక ఘటనలు ఇప్పటికే మనం విన్నాం. వర్షాలు పడుతున్నాయి అంటే ఎక్కడెక్కడి వజ్రాల వ్యాపారుల దృష్టి ఈ జిల్లాలపై పడుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇక ఈ వార్త కడప జిల్లా వాసులను పెన్నా నది పరివాహక ప్రాంతం పై ఫోకస్ చేసేలా చేస్తోంది.

ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

దేశవ్యాప్తంగా ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలో ఎక్కడెక్కడ, ఏ స్థాయిలో ఖనిజాలు ఉన్నాయన్న దానిపై ప్రత్యేకమైన పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలో అత్యధికంగా ఖనిజాలు ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ 21 మైనింగ్ బ్లాక్ లను నివేదించగా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు తొమ్మిది చొప్పున మైనింగ్ బ్లాక్ లను కలిగి ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. మొత్తం 14 రాష్ట్రాల్లో ఖనిజ సంపదకు సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు ఇచ్చింది.

ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల గనులు

ఏపీలో వైఎస్సార్ కడప జిల్లాలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల గనులు

తాజాగా అన్ని రాష్ట్రాల మైనింగ్ శాఖలతో కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే తాలూకు నివేదికలను ఆయా రాష్ట్రాలకు అందజేశారు. ఆయా రాష్ట్రాల నుండి హాజరైన మైనింగ్ శాఖా ఉన్నతాధికారులు ఆ నివేదికలను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కడప వజ్రాల గనులు ఉన్నట్టు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది . కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశముందని, అక్కడ వజ్రాల గనులు ఉన్నట్లుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తేల్చారు.

 ఏపీలో ఎక్కడెక్కడ ఖనిజ సంపద ఉందంటే

ఏపీలో ఎక్కడెక్కడ ఖనిజ సంపద ఉందంటే

ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ములగపాడులో 4.02 చదరపు కిలోమీటర్లు, విశాఖ జిల్లా నందాలో 2.04 చదరపు కిలోమీటర్లు, బుద్ధ రాయవలసలో 6.38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాంగనీసు బ్లాకులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని లక్ష్మక్క పల్లిలో 30.7 23 చదరపు కిలోమీటర్లు, అలాగే అద్దంకి వారి పాలెంలో 9.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐరన్ ఓర్ బ్లాక్ లు ఉన్నాయని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మాసాయిపేట పరిధిలో 20 చదరపు కిలోమీటర్ల మేర బేస్ మెటల్ ఉన్నట్లుగా పేర్కొన్నారు.

 పెన్నానదీ పరీవాహక ప్రాంతంలో వజ్రాల గనులు ,.. ఏపీలో హాట్ టాపిక్

పెన్నానదీ పరీవాహక ప్రాంతంలో వజ్రాల గనులు ,.. ఏపీలో హాట్ టాపిక్

అసలు ఇంతకీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖనిజాన్వేషణ జరపడానికి అసలు కారణం ఆదాయ వనరుల అన్వేషణ. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఖనిజాలు ఉన్నాయో గుర్తించి, వాటి మైనింగ్ లీజులను ఇచ్చి ఆదాయ వనరులను పెంచుకోవడం ప్రధాన ఉద్దేశంగా సర్వే నిర్వహించింది. ఇక దేశంలో జరిపిన పరిశోధనలో ఏపీ లోని వైయస్సార్ కడప జిల్లాలో దాదాపు 37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వజ్రాల గనులు ఉండడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తుంది. రాజకీయ వర్గాలలోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే అక్రమ మైనింగ్ పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో వజ్రాల గనులు ఉన్నాయన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దేశ వ్యాప్తంగా 100 మినరల్ బ్లాక్స్, లీజులకు ఇచ్చేందుకు రాష్ట్రాల వేలం పాటలు

దేశ వ్యాప్తంగా 100 మినరల్ బ్లాక్స్, లీజులకు ఇచ్చేందుకు రాష్ట్రాల వేలం పాటలు

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం మొత్తం దేశ వ్యాప్తంగా 100 మినరల్ బ్లాక్స్ ను గుర్తించింది. ఇక వీటన్నిటికీ కాంపోజిట్ లీజ్ లను ఇవ్వటానికి ఆయా రాష్ట్రాలు వేలం నిర్వహించవలసి ఉంటుంది. ఇక లీజుకు ఇవ్వనున్న మైనింగ్ బ్లాక్ లలో వెంటనే ఖనిజం తవ్వకాలు చేయడానికి అవకాశం లేదు. అందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మైనింగ్ లీజులు తీసుకున్నవారు తీసుకున్న బ్లాక్ లో ఎంతవరకు ఖనిజం ఉంది అన్నది, అది ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి సొంతంగా సర్వేలు చేయించుకోవాలి. అందుకు వారు జీ 3, 2,1 స్థాయి సర్వేలు చేయించుకోవాలి. ఇక ఆ సర్వేలను నిర్వహించటానికి రెండు సంవత్సరాల నుండి ఐదేళ్ళ వరకు అనుమతి ఇస్తారు. ఆ సర్వే నివేదికలను ప్రభుత్వానికి అందించిన తర్వాతే వారు మైనింగ్ లీజు నిర్వహించడానికి అవకాశం ఉంది. వారికిచ్చిన కాంపోజిట్ లీజును , సాధారణ లీజుగా మార్చి మైనింగ్ కు అవకాశం కల్పిస్తారు.

వజ్రాల లభ్యత నేపధ్యంలో కడపలో ఏం జరుగుతుందో ? సీఎం సొంత జిల్లాపై ఆసక్తి

వజ్రాల లభ్యత నేపధ్యంలో కడపలో ఏం జరుగుతుందో ? సీఎం సొంత జిల్లాపై ఆసక్తి

ఇక మైనింగ్ విషయంలో ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా అడ్డగోలు మైనింగ్ జరుగుతూనే ఉంది. మైనింగ్ తీసుకున్న పరిధి కంటే ఎక్కువ చెయ్యటం, అసలు అనుమతులే లేకుండా మైనింగ్ నిర్వహించటం చేస్తూ మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది . ఇప్పుడు తాజాగా కడప జిల్లాలో వజ్రాల గనులు ఉన్నాయి అన్న వార్తల నేపథ్యంలో పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఏపీలో వజ్రాల గనులంటే ఏపీ పంట పండినట్టేనా అని కొందరు చర్చలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ముందు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది, వజ్రాల మైనింగ్ కోసం ఏం జరగబోతుంది, సీఎం సొంత జిల్లాలో వజ్రాలంటే ఇక వారి పంట పండినట్టే అంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాలుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+