వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి చంద్రబాబుపై కోపం తగ్గలేదా ? భీమవరం ఈవెంట్ కు రావొద్దన్నారా ? కిషన్ రెడ్డి ఫోన్ కాల్ !

|
Google Oneindia TeluguNews

75 ఏళ్ల స్వాతంత్రానికి గుర్తుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అజాదీ అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను ఏపీలోని భీమవరంలో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు కూడా ఆహ్వానాలు పంపింది. అయితే సీఎం జగన్ పారిస్ టూర్ ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదు. మరోవైపు టీడీపీ తరఫున చంద్రబాబుకు ఆహ్వానం పంపిన కేంద్రం.. ఓ ప్రజాప్రతినిధిని పంపాలని మాత్రమే కోరింది. దీంతో చంద్రబాబును ఊరించి ఉసూరుమనిపించినట్లయిందన్న ప్రచారం జరుగుతోంది.

మోడీ-చంద్రబాబు గతం

మోడీ-చంద్రబాబు గతం

ఏపీలో గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీతో అధికారం కూడా పంచుకున్నారు. అయితే మూడేళ్లలోనే విపక్ష నేత జగన్ ట్రాప్ లో పడి కేంద్రంలో మంత్రిపదవులకు గుడ్ బై చెప్పడంతో పాటు ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు.. ప్రధాని మోడీ, బీజేపీలపై ధర్మపోరాటం ప్రారంభించారు. ఏపీకి వచ్చిన మోడీ, అమిత్ షాలను టార్గెట్ చేసి ఫ్లెక్సీలు పెట్టారు. అంతటితో ఆగకుండా జాతీయస్ధాయిలో 22 విపక్ష పార్టీల్ని ఏకం చేసి మోడీని గద్దిదించుతామని హుంకరించారు. చివరికి 2019 ఎన్నికల్లో టీడీపీ సహా ఈ పార్టీలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు తన తప్పు తెలుసుకుని సైలెంట్ అయిపోయారు.

మళ్లీ పొత్తుకు విఫలయత్నం

మళ్లీ పొత్తుకు విఫలయత్నం

గతంలో బీజేపీతో రెండుసార్లు పొత్తు పెట్టుకుని ఏపీలో విజయాలు సాధించిన చరిత్ర ఉన్న చంద్రబాబు.. మరోసారి కాషాయ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నాగపూర్ కు దూతల్ని పంపి మరీ పొత్తు కోసం రాయబారాలు ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంతే కాదు మోడీ-షా ద్వయం మరోసారి చంద్రబాబును ఆదరించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేమన్న సంకేతాల్ని ఎప్పటికప్పుడు పంపుతూనే ఉన్నారు.

మోడీ భీమవరం టూర్ లో మరోసారి

మోడీ భీమవరం టూర్ లో మరోసారి

ప్రధాని మోడీ అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 4న భీమవరం వస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్ని ఈ వేడుకకు ఆహ్వానించారు. అయితే సీఎం జగన్ పారిస్ టూర్ కారణంగా ఈ వేడుకకు దూరం అయ్యారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ వేడుకకు ఆహ్వనం అందింది. అయితే ఈ కార్యక్రమానికి కేవలం పార్టీ నుంచి ఓ ప్రజాప్రతినిధిని పంపాలని మాత్రమే ఈ ఆహ్వానంలో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో మోడీ టూర్ లో చంద్రబాబుకు బదులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని చంద్రబాబు పంపుతున్నారు.

రావొద్దంటూ కిషన్ రెడ్డి ఫోన్ కాల్ ?

రావొద్దంటూ కిషన్ రెడ్డి ఫోన్ కాల్ ?

వాస్తవానికి మోడీ భీమవరం టూర్ కు అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపుతున్నా అందరికీ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి చెప్పడం లేదని తెలుస్తోంది. కానీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ఈ టూర్ కోసం ఆహ్వనం పంపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఫోన్ కూడా చేశారు. అయితే ఈ ఫోన్ కాల్ లో చంద్రబాబుకు
ఆయన తాజా పరిస్ధితిని వివరించినట్లు తెలుస్తోంది. ప్రధాని కార్యక్రమానికి కేవలం పార్టీ ప్రతినిధి మాత్రమే పంపాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు కూడా సరేనన్నారు.

చంద్రబాబుపై మోడీ కోపం తగ్గలేదా ?

చంద్రబాబుపై మోడీ కోపం తగ్గలేదా ?

ఒకప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారం సాధించుకోవడంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీకి కనీస సీట్లు సాధించుకున్నారు. అలాగే తిరుపతిలో ఏపీకి విభజన హామీలు కూడా ఇచ్చారు. అమరావతిని ఢిల్లీని మించిన రాజధాని చేస్తామన్నారు. ఆ తర్వాత అమరావతి రాజధానికి శంఖుస్ధాపన కూడా చేశారు. అనంతరం మారిన రాజకీయాల్లో చంద్రబాబు బీజీపీతో పాటు ప్రధాని మోడీని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. అంతే కాదు తిరుపతి వచ్చిన అమిత్ షా కారుపైనా రాళ్లు వేయించారు. దీంతో ఈ వ్యవహారాన్ని మోడీ-షా జోడీ వ్యక్తిగతంగా తీసుకుంది. దీంతో అప్పటి నుంచి మరోసారి చంద్రబాబుతో ఎలాంటి సంబంధాలు వద్దని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చినా అపాయింట్ మెంట్లు ఇవ్వలేదు. ఇప్పుుడు భీమవరం టూర్ కూ చంద్రబాబు ను ఆహ్వానించినట్లే ఆహ్వానించి రావొద్దని ఫోన్ కాల్ చేయించినట్లు తెలుస్తోంది.

English summary
tdp chief chandrababu has not invited personally to pm modi's bhimavaram tour on july 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X