జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నించిందా ? ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియో..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్ధులపై ఏ విధంగా అయినా పైచేయి సాధించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ-జనసేన ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ కూడా ఘాటుగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన ట్విస్ట్ ఇచ్చింది.

did ysrcp try for tie-up with janasena in 2017 jsp shared prashant kishor s sensational video

ఇప్పుడు టీడీపీ-జనసేన పొత్తుల్లేకుండా పోటీ చేయలేవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ చేసిన ప్రయత్నాలకు ఆధారంగా ఉన్న ఓ వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అప్పటి వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసి గతంలో తమతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడిందంటూ జనసేన పోస్ట్ చేసింది.

2017లో నంద్యాల ఉప ఎన్నిక ఓడిపోయిన తర్వాత వైసీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నాల్లో భాగంగా జనసేనతో పొత్తును పరిశీలించినట్లు ప్రశాంత్ కిషోర్ ఈ వీడియోలో వెల్లడించారు. ఈ మేరకు ప్రయత్నించాలని తనకు వైసీపీ నేతలు, సానుభూతి పరులు తనకు చెప్పినట్లు పీకే తెలిపారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ విషయాలు ఎప్పుడు ఎవరికి వెల్లడిస్తున్నారో మాత్రం ఈ వీడియోలో వెల్లడి కాలేదు.

కానీ వైసీపీ మాత్రం జనసేనతో పొత్తు కోసం గతంలో ప్రయత్నించిన విషయాన్ని మాత్రం పీకే గట్టిగానే చెప్పుకొచ్చారు. ఈ వీడియోతో పొత్తుల విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+