వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఉద్యోగ సంఘాల ఆందోళన బాట: నాయకుల మధ్య విభేదాలు: ప్రభుత్వంపై అనుకూల..వ్యతిరేకంగా..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉద్యోగ సంఘాల్లోనూ ప్రభుత్వ అనుకూల..వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దశళ వారీగా ఆందోళతను ఏపీ జేఏసీ పిలుపునిచ్చింది. అయితే, ఇందులో తాము పాల్గొనటం లేదని..ఇది ఉద్యోగుల ఐక్యతను చెడగొట్టడమేనని ఏపీ జేఏసీ పాల్గొనదని ఆ సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు పెంపుదల చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా.. ఏకపక్షంగా వ్యవహరించటం సరి కాదని మరో సంఘ నేతలు వాదిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఉద్యోగుల్లో ఈ వ్యవహారం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇది కొత్త చర్చకు కారణమవుతోంది.

ఏపీలో ఏసీబీ భారీ స్కెచ్ :హిట్ లిస్టు రెడీ..ముహూర్తం ఖరారు :ముఖ్యమంత్రి కీలక అదేశాలు ..!ఏపీలో ఏసీబీ భారీ స్కెచ్ :హిట్ లిస్టు రెడీ..ముహూర్తం ఖరారు :ముఖ్యమంత్రి కీలక అదేశాలు ..!

నిరసనలకు జేఏసీ నేతల పిలుపు..

నిరసనలకు జేఏసీ నేతల పిలుపు..

సకాలంలో 11వ వేతన సవరణ అమలు, 3 విడతల డీఏ బకాయిల మంజూరు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హెల్త్‌కార్డుల వంటి ప్రధాన సమస్యల పరిష్కారం లో ప్రభుత్వం జాప్యం చేస్తున్న నేపథ్యంలో దశల వారీగా ఆందోళనకు పిలుపునిచ్చినట్లు ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. సచివాలయంలో ఇన్‌చార్ట్‌ సీఎస్‌ నీరభ్ కుమార్‌ ప్రసాద్‌ను కలిసి ఈ నెల 20 నుంచి ఏపీ ఉద్యోగు ల జేఏసీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నోటీసు ఇచ్చారు. ఈ నెల 20న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై, భోజన విరామం సమయంలో ప్రదర్శన, 26న తాలూకా కేంద్రాల్లో ధర్నా, డిసెంబరు 10న జిల్లా కేంద్రాలు, 20న రాజధానిలో ధర్నాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.

మా సంఘాలు పాల్గొనటం లేదు...

మా సంఘాలు పాల్గొనటం లేదు...

ఎన్జీఓల జేఏసీ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో ఏపీ జేఏసి అమరావతి లోని డిపార్ట్మెంట్ సంఘాలు ఎవరూ పాల్గొనడం లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు స్పష్టం చేసారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీయడానికే ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు నిచ్చారని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సమస్యలపై కానీ సామాజిక బాధ్యత అంశాలపై గాని ఉద్యోగులంతా ఏకతాటిపై స్పందించే సాంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగుతుందని అటువంటిది ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా.. స్వప్రయోజనాల కోసం తీవ్రత లేని సమస్యలపై ఎపి ఎన్ జి ఓ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ఆందోళన కార్యక్రమాలను ప్రకటిచడం ఉద్యోగుల ఐక్యతను చెడగొట్టడమేనని అందువలన ఏపీ జేఏసి అమరావతి కి ఈ ఆందోళన కార్యక్రమాలకు ఏ విధమైన సంబంధము లేదని వివరణ ఇచ్చారు.

ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా..

ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా..

మాట్లాడుతూ ప్రభుత్వము ఏర్పాటైన తక్కువ వ్యవధిలోనే ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి ఇచ్చిన విషయాన్ని బొప్పరాజు గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు అనేక సెక్టార్ లకు చెందిన ఉద్యోగులకు జీతాలు పెంపుదల చేయడమే కాకుండా.. పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించి అమలు చేస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన ఇతర విషయాల పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలు..డిమాండ్స్ గురించి ముందుగా ప్రభుత్వంతో చర్చించి.. వాటిపట్ల ప్రభుత్వం యొక్క విధానము తెలుసుకోవలసి ఉన్నదని అలా కాకుండా ఏకపక్షంగా ఒకేసారి ఆందోళన కార్యక్రమాలకు పిలుపును ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వివిధ శాఖలకు చెందిన సభ్యులు ఎన్జీవో అసోసియేషన్ లో సభ్యులుగా ఉంటారని అటువంటిది డిపార్ట్మెంట్ల సంఘాలతో కనీస సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే సాంప్రదాయాన్ని చంద్రశేఖర్ రెడ్డి తెర తీసారని విమర్శించారు. బొప్పరాజు వ్యాఖ్యల మీద ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు స్పందిస్తూ..ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

English summary
Differences between Ap employees associations in AP on protests against govt. Amaravati JAc not co operating with NGO's JAC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X