టి ఇస్తాం, రిజైన్ చేసుకోవచ్చు!: సీమాంధ్రకు డిగ్గీ షాక్

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని, ఆంటోని కమిటీ నివేది వచ్చేదాకా నోట్ పైన ముందుకు వెళ్లవద్దని తాను హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు చెబుతానని, ఆ తర్వా వెనక్కి వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టారట. తెలంగాణ విషయంలో వేరే ఆలోచనకు ఆస్కారమే లేదని, విభజన అంశంపై మాట్లాడక పోవడమే మంచిదని చెప్పారట. హైదరాబాదు విషయంపై ఏమైనా ఉంటే చెప్పాలని సూచించారట.
తమపై రాజీనామాల ఒత్తిడి వస్తుందని వారు డిగ్గీ దృష్టికి తీసుకు వస్తే... రాజీనామాలు చేయాలనుకుంటే చేయవచ్చునని, తనతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని వారికి తేల్చి చెప్పారట. దాదాపు గంటకు పైగా సీమాంధ్ర నేతలు డిగ్గీతో భేటీ అయ్యారు. ఆయన ఏ సమయంలోను వారికి అనుకూలంగా మాట్లాడలేదట.
అహ్మద్ పటేల్ వ్యాఖ్యలపై కెవిపి వివరణ
కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇటీవల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను ఇటీవల కలిసినప్పుడు తెలంగాణపై తొందరపడి నిర్ణయం తీసుకున్నామన్నారని వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దానిపై కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు స్పందించారు. పటేల్‌తో జరిగిన భేటీకి తాను హాజరయ్యానని, తెలంగాణపై తొందరపడి నిర్ణయం తీసుకున్నట్లు అనలేదని, ఆయన ఉన్నత వ్యక్తిత్వం గల నాయకుడని, పార్టీకి, పార్టీ అధ్యక్షురాలికి విధేయుడని, పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయంపై కానీ, చర్యలపై కానీ ఆయన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications