కిరణ్ జట్టుకు డిగ్గీ పిలుపు, కెసిఆర్‌పై టి కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: తిరిగి కాంగ్రెసు పార్టీలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ జై సమైక్యాంధ్ర పార్టీ నేత, అమలాపురం ఎంపి హర్షకుమార్‌ను కోరారు. హర్షకుమార్ ఢిల్లీలో ఉన్నారు. ఆయనకు డిగ్గీ బుధవారం రాత్రి ఫోన్ చేశారు. తిరిగి కాంగ్రెసులోకి రావాలని ఆహ్వానం పలికారు.
డిగ్గీ వ్యాఖ్యలకు స్పందించిన హర్ష కుమార్.. తాను పార్టీని వీడలేదని, పార్టీయే తనను బహిష్కరించిందని చెప్పారు. తాను తిరిగి కాంగ్రెసు పార్టీలోకి రావాలంటే ముందుగా బహిష్కరణ ఎత్తివేయాల్సి ఉంటుందని చెప్పారు. దానికి డిగ్గీ కూడా బహిష్కరణ ఎత్తివేస్తామని, పార్టీలోకి రావాలని చెప్పారు. ఈ విషయమై కిరణ్ కుమార్ రెడ్డితోను మాట్లాడుతామని చెప్పారు.

తెలంగాణ ప్రజలకు టి కాంగ్రెసు నేతల పిలుపు
కాంగ్రెసు పార్టీకి ఓటు వేయడం తెలంగాణ ప్రజల కర్తవ్యమని మాజీ మంత్రి జానా రెడ్డి హైదరాబాదులో అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. తెలంగాణలో తొలి పరిపాలన కాంగ్రెసు అందిస్తుంనద్నారు. అన్ని రకాల అవినీతిని రూపుమాపాలన్నదే తమ అభిమతమని చెప్పారు. సిపిఐతో పొత్తు చర్చలు జరుగుతున్నాయన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పరిస్థితులు మరింత దూరం వెళ్లాయన్నారు. సిపిఐతో తమ పొత్తు ఆశతో కాదని ఆశయంతో అన్నారు. తన కుమారుడిని పోటీ చేయించే విషయం అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఈ నెల 13న రాహుల్, 16న సోనియా తెలంగాణ ప్రచార సభల్లో పాల్గొంటారన్నారు.
తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మోసపూరిత వైఖరికి పాల్పడుతున్నారని టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తెలంగాణలో ఆయన అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇవాళో రేపో సిపిఐతో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. తెరాస నుండి ప్రతిపాదనలు వస్తే తాము పరిశీలిస్తామని చెప్పామని కానీ రాలేదన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెసులో చేరుతున్నారని చెప్పారు. మజ్లిస్ పార్టీతో గతంలో మాదిరి ఒప్పందం కుదురిందన్నారు.












Click it and Unblock the Notifications