విభజన: ఊరూరా జైరామ్, లేఖలో రాసిందే రాసిన డిగ్గీ

Digvijay letter on AP division to Chidambaram
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీని కాపాడుకునేందుకు కేందమంత్రి జైరామ్ రమేష్ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగుతున్నారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ముఖ్య సీమాంధ్ర నగరాల్లో ప్రెస్ మీట్లు పెట్టి విభజనకు అన్ని పార్టీలు కారణమని, సీమాంధ్రకు తాము అన్నీ చేస్తామంటూ చెబుతూ ప్రజల్లో కాంగ్రెసు పార్టీ పట్ల విశ్వాసం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఫిబ్రవరి 25న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి పంపిన లేఖలో రాసిందే రాశారట. ఇందులో మూడు పేరాలను ఒకదాని తర్వాత ఒఖటిగా పునరావృతం చేసినా పట్టించుకోకుండా ఆ లేఖపై సంతకం పెట్టారు.

ఎపి పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సభాముఖంగా సీమాంధ్ర ప్రాంతానికి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, తక్షణం వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని 25న డిగ్గీ ఆర్థికమంత్రికి ఏడు పాయింట్లతో లేఖ రాశారు. అందులో ఐదు, ఆరు, ఏడు అంశాలు వాక్య నిర్మాణం మారినా ఒకటే విషయం ఉంది. మూడు, నాలుగు అంశాలు ఒక్కటే రాశారు.

13వ ఫైనాన్స్ కమిషన్ అవార్డును రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి, ఇతర కొలమానాల ప్రతిపాదికన పంచాలి. విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న వనరులను పరిగణలోకి తీసుకొని వేర్వేరుగా కేటాయింపులు జరిపేలా 14వ ఆర్థిక సంఘానికి ఉత్తర్వులు ఇప్పించడం.

అపాయింటెడ్ తేదీకు, 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి మధ్యకాలంలో ఎపికి ఎదురయ్యే ఆదాయ లోటును పూడ్చడానికి కేంద్రం ప్రత్యేక గ్రాంట్ ఇవ్వడం. కాగా, ఈ అంశాన్ని అక్షరం మార్చకుండా రెండుసార్లు రాశారు.

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఇచ్చిన ప్రోత్సాహకాల తరహాలో ఎపికి, తెలంగాణలకు పారిశ్రామిక, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు తగిన పన్ను ప్రోత్సాహకాలతో పాటు, ఇతర ఆర్థిక చర్యలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని డిగ్గీ ఆ లేఖలో కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+