చిరుకు డిగ్గీ హామీ: ఎపి ఎక్స్‌ప్రెస్‌లా.. టి ఆగదన్న జెసి
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగనివ్వమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శనివారం చెప్పారు. విభజన, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయకపోవడంపై చిరంజీవి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
విభజనపై కేబినెట్ నిర్ణయంలో సీమాంధ్రకు న్యాయం చేసే అంశాలు లేవని చిరు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేశారు. సీమాంద్రకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని చెప్పారు.

విభజన ఆగదు: జెసి
రాష్ట్ర విభజన జరుగుతుందని మాజీ మంత్రి, ఆనంతపురం కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సిఎల్పీ కార్యాలయంలో అన్నారు. విభజన ఆగిపోతుందన్న నమ్మకం తమకు లేదని, కేంద్రం ఏమైనా చేయగలుగుతుందన్నారు. మంత్రులు రెండురోజుల సమయం అఏఢిగారని, మన మంత్రులే కాకుండా ఏ మంత్రీ నివేదికను పూర్తిగా చదవలేదని చెప్పారు. ఎపి ఎక్స్‌ప్రెస్‌లా షిండే చదవడం అందరూ తల ఊపడం జరిగిందని విమర్శించారు.
వాళ్లు రంభ అంటే రంభ, గాడిద అంటే గాడిద అంతే అని వ్యాఖ్యానించారు. కిరణ్ విభజన జరగదని చెబుతున్నారు కదా... అని ప్రశ్నించగా.. ఆయన ఆశాజీవి అని, తాను వాస్తవాలు గ్రహించినవాడినని జెసి చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లు గట్టెక్కినా, ఎక్కకపోయినా దానికి ప్రాధాన్యం ఉండదన్నారు.
తెలంగాణలో ఎక్కువ కాలం ఉండటం దండుగ అని, ఏడాదిలో భవనాలు కట్టుకునే సాంకేతికత ఉందన్నారు. కేంద్రం కూడా ఆర్థిక సాయం చేస్తుందని, కొత్త రాజధాని ఏదో చూసుకొని మూటముల్లే సర్దుకోవడం ఉత్తమమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications